Begin typing your search above and press return to search.
యూట్యూబ్ లో నెం.1 గా నిలిచిన బేబీ షార్క్
By: Tupaki Desk | 3 Nov 2020 11:10 AM GMTయూట్యూబ్ లో కోటి రెండు కోట్ల వ్యూస్ దక్కితేనే గొప్ప విషయంగా చెప్పుకుంటారు. వంద కోట్ల వ్యూస్ సాధించిన వీడియో అంటే చాలా గొప్ప విషయం. అలాంటిది ఒక చిన్న పిల్లల రైమ్ ఏకంగా 700 కోట్ల వ్యూస్ ను దక్కించుకుంది. దక్షిణ కొరియాకు చెందిన పింక్ ఫాంగ్ యూట్యూబ్ ఛానెల్ వారి బేబీ షార్క్ పాట ప్రపంచంలోనే అత్యధిక వ్యూస్ ను దక్కించుకున్న యూట్యూబ్ వీడియోగా నిలిచింది. 2016 జూన్ లో యూట్యూబ్ లో పోస్ట్ అయిన ఈ పాటకు అప్పటి నుండి రోజుకు లక్షల్లో వ్యూస్ వస్తూనే ఉన్నాయి.
మొన్నటి వరకు నెం.1 గా ఉన్న డెస్పాసిటో పాటను వెనక్కు నెట్టేసి నెం.1 స్థానంను దక్కించుకుంది. అమెరికన్ సాంగ్ క్యాంప్ ఫైర్ పాటకు రీమిక్స్ గా బేబీ షార్క్ రైమ్ ను రూపొందించారు. పిల్లలకు మాత్రమే కాకుండా పెద్ద వారిని కూడా ఆకట్టుకోవడం వల్ల ఈ పాటకు ఈ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. ఎన్నో దేశాల్లో ఈ పాటను వివిధ రకాలుగా వాడుతూ ఉంటారు.

అమెరికాలోని ఫ్లోరిడాలో జనాలు ఎక్కడ పడితే అక్కడ గుమ్మి గూడకుండా ఉండేందుకు ఈ పాటను ప్లే చేస్తూ ఉంటారు. ఆ పాట ప్లే అయితే జనాలు గుమ్మి కూడటం నిషేదం. ఇక ది వాషింగ్టన్ బేస్‌బాల్ జట్టు తమ థీమ్ మ్యూజిక్ లో దీన్ని చేర్చుకున్నారు. ఆ పాట చేర్చుకున్న సంవత్సరంలో ఆ జట్టు సిరీస్ ను సొంతం చేసుకోవడం విశేషం. ఇలా పెద్దలను కూడా ఆకట్టుకుంటూ పిల్లలకు మంచి రైమ్ గా మారడంతో పాటు సింపుల్ డాన్స్ స్టెప్పులు మరియు ఈజీగా అర్థం అయ్యే పదాలు ఉండటం వల్ల భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. యూట్యూబ్ లో మొదటి వెయ్యి కోట్ల వ్యూస్ ను దక్కించుకోబోతున్న వీడియోగా దీనిని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏడాది లేదా ఏడాదిన్నరలో 300 కోట్ల వ్యూస్ ను దక్కించుకుని వెయ్యి కోట్లకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు.