Begin typing your search above and press return to search.
ఆదిత్య 369.. పైరసీ రిక్వెస్
By: Tupaki Desk | 18 July 2016 3:30 PM GMTఇప్పడు ఇండియాలోని అన్ని ఫిలిం ఇండస్ర్టీలనూ పట్టిపీడిస్తున్న బూతం.. పైరసీ. అసలు ఆన్ లైన్లో ముందే సినిమా లీకవ్వడం వలన.. పెద్ద పెద్ద సినిమాలకు కూడా ఓపెనింగులు రావట్లేదు. తెలుగులో అయితే బాహుబలి కబాలి వంటి పెద్ద సినిమాలు కోర్టు నుండి ఆర్డర్లు తెచ్చుకుని వెబ్ సైట్లను బ్లాక్ చేయించుకుంటున్నారు కాని.. చిన్న సినిమాల వారైతే యాక్షన్ తీసుకునేలోపే చేతులు కాలిపోతున్నాయి.
అసలు చెప్పొచ్చే విషయం ఏంటంటే.. ఈ పైరసీ బూతం ఇప్పటిది కాదు. 25 సంవత్సరాల క్రితం కూడా ఉంది. అదిగో ''ఆదిత్య 369'' సినిమా నిర్మాత అనిత (శివలెంక కృష్ణప్రసాద్ భార్య) అప్పట్లో సినిమా రిలీజుకు ముందు అభిమానులకు ఒక లేఖ రాశారు. అందులో కూడా ఆవిడ పైరసీ గురించి ప్రస్తావించారు. 90లలో మారుమూల ధియేటర్లలో వీడియో కెమెరాతో సినిమాను షూట్ చేసేసి.. విసిఆర్/విసిపి లలో ప్లే అయ్యే క్యాసెట్ల ద్వారా పైరసీ జరిగేది. అప్పట్లో మరి డబ్బున్న వారిళ్ళలోనే ఈ ప్లేయర్లు ఎక్కువగా ఉండేవి కాబట్టి.. సినిమా రెవెన్యూ విషయంలో పెద్దగా ఇంపాక్ట్ లేదేమో కాని.. ఇప్పుడు ఆన్ లైన్లో వచ్చే ప్రింటయితే చిన్న మొబైల్ ఫోన్లో కూడా ప్లే అవుతోంది కాబట్టే.. అసలు నష్టమంతా.
కాని 25 ఏళ్ళ నుండి పైరసీ బూతాన్ని అరికట్టలేకపోవడం అంటే చేతకాని తనమే. కఠినమైన రూల్సు లేకపోవడం.. సరైన రిలీజ్ సిస్టం.. అలాగే నిర్మాతలలో ఐకమత్యం లేకపోవడమే సమస్యకు ప్రధాన కారణం అని అనుకోవాలా??