Begin typing your search above and press return to search.
మెర్శల్ పైరసీ కట్టలు తెంచుకుంది
By: Tupaki Desk | 22 Oct 2017 8:58 AM GMTతమిళనాట పైరసీ ఎంత దారుణంగా ఉంటుందో తెలిసిన సంగతే. తమిళ సినిమాల పైరసీ ప్రింట్లను అందుబాటులోకి తెచ్చే వెబ్ సైట్లకు లెక్కే లేదు. సినిమా విడుదలైన రోజు రాత్రికల్లా పైరసీ ప్రింట్ పెట్టేస్తాయి ఈ వెబ్ సైట్లు. ట్విట్టర్లో అధికారికంగా ప్రకటించి మరీ పైరసీ వెర్షన్లను ఆన్ లైన్లోకి తెస్తుంటాయి ఈ వెబ్ సైట్లు. ఈ దీపావళికి భారీ అంచనాల మధ్య విడుదలైన విజయ్ కొత్త సినిమా ‘మెర్శల్’ను పైరసీ నుంచి కాపాడేందుకు ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. ఈ సినిమా పైరసీ ప్రింట్ పెట్టకుండా దాదాపు 2500 వెబ్ సైట్ల మీద నిషేధం విధిస్తూ కోర్టు ఆదేశాలు వచ్చేలా చేసినా ఏం లాభం? ఈ సినిమా పైరసీ ఆన్ లైన్లో విస్తృతంగా అందుబాటులోకి వచ్చేసింది.
తమిళ్ రాకర్స్ తో పాటుగా పైరేట్ బే అనే వెబ్ సైట్లలో ఈ సినిమా పైరసీ లింకులు అందుబాటులోకి వచ్చాయి. వాటి నుంచి నెటిజన్లు పెద్ద ఎత్తున సినిమాను డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. పైరేట్ బే వెబ్ సైట్లో ఈ సినిమాను 8 వేల మంది దాకా డౌన్ లోడ్ చేసుకోవడం గమనార్హం. ఇక తమిళ సినిమాల పైరసీకి బాగా పేరుపడ్డ తమిల్ రాకర్స్ కొత్త హోస్ట్ సైట్ క్రియేట్ చేసి ‘మెర్శల్’ డౌన్ లోడ్ లింకులు అందిస్తోంది. మరో ప్రాక్సీ సర్వర్ ద్వారా కూడా డౌన్ లోడ్ చేసుకునే సదుపాయం కల్పిస్తోంది. ‘మెర్శల్’ సినిమాలో వైద్యులకు వ్యతిరేకంగా డైలాగులుండటంతో తమిళనాడు వైద్యులందరూ ఈ సినిమా పైరసీని అదే పనిగా విస్తృతం చేస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.