Begin typing your search above and press return to search.
ఆ రెండింటి తెలుగు వర్షన్లకు దెబ్బేనా?
By: Tupaki Desk | 21 Oct 2017 6:03 AM GMTఇప్పుడు రెండు తమిళ సినిమాలు అక్కడ బాగానే ఆడుతున్నాయి కాని.. వాటికి కొంతమంది వేసిన దెబ్బమాత్రం అంతా ఇంతా కాదు. అందుకే వాటి తెలుగు వర్షన్ రిలీజ్ కు ఇప్పుడు చాలా ఇబ్బందులే రావొచ్చు అనే సందేహం వస్తోంది. ఎందుకంటే మనోళ్లు అసలే ఈ మధ్యన సినిమా అంటే చాలు.. అది ఏ లాంగ్వేజ్ అయినా కూడా చూడ్డానికి రెడీ అయిపోతున్నారు.
విజయ్ మెర్సాల్ సినిమా అక్కడ బాగానే ఆడుతోంది. అయితే ఈ సినిమా తమిళ వర్షన్ రిలీజ్ అవ్వడంతో కొంతమంది ఆల్రెడీ మల్టీప్లెక్సుల్లో తమిళ వర్షన్ చూసేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే అక్కడి డాక్టర్లు కొందరు సినిమా పైరసీ లింక్ ను షేర్ చేస్తూ కక్ష తీర్చుకుంటున్నవేళ.. ఆ లింక్ మనోళ్ళకూ చిక్కేయడంతో..కొందరు ఈ ప్రింట్ ను కూడా చూసేస్తున్నారట. ఇకపోతే విశాల్ తుప్పరివాలన్ సినిమా కూడా మంచి థ్రిల్లర్ గా క్రిటిక్స్ నుండి ప్రశంసలు అందుకుని ఆడేస్తోంది. దీని తెలుగు వర్షన్ కూడా రిలీజవ్వాల్సి ఉంది. అయితే ఈ సినిమా కూడా పైరసీ భారిన పడింది. కొన్ని పైరసీ గ్యాంగులు వార్నింగ్ ఇచ్చి మరీ సినిమాను ముందే రిలీజ్ చేశారు. కట్ చేస్తే విశాల్ స్వయంగా ఎమెజాన్ ప్రైమ్ లో సినిమాను అఫీషియల్ గా విడుదల చేసేశాడు. ఇప్పుడు ఆ సూపర్ హెచ్ డి ప్రింటు కూడా నెట్లోకి వచ్చేసింది.
ఇదంతా చూస్తుంటే... ఈ రెండు సినిమాలు తెలుగులో 'అదిరింది' - 'డిటెక్టివ్' అంటూ రిలీజయ్యే సమయానికి అసలు ఈ సినిమాను చాలామంది సినిమా లవ్వర్లు చూసేసి ఉంటారేమో. పైరసీ వలన ఎంత నష్టపోతున్నారో ఇప్పటికైనా చాలామంది అర్ధంచేసుకుని చర్యలు చేపట్టాలని అంటున్నారు ట్రేడ్ వర్గాలు. అది సంగతి.