Begin typing your search above and press return to search.
సిద్దార్థకు హిట్ కష్టమేనా?
By: Tupaki Desk | 4 Nov 2017 1:57 PM GMTతెలుగు సినిమాల నుంచి కనుమరుగైపోయిన హీరోలు ఒక్కరొక్కరిగా మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నారు. హీరో సిద్దార్థ కూడా ఆ కోవలోకే వస్తారు.. అయితే, తెలుగులో మళ్లీ హిట్ కొట్టాలన్న ఆయన ఆశలు నెరవేరవే అవకాశాలు కనిపించడం లేదు. అందుకు కారణం ఉంది... సిద్దార్థ నటించిన అవల్ సినిమా రీసెంటుగా తమిళంలో మంచి హిట్టయింది. నిజానికి ఈ సినిమా తమిళ వెర్షన్ తో పాటు తెలుగు వెర్షన్ కూడా అదే రోజు విడుదల కావాల్సి ఉంది. కానీ, ఎందుకో దాన్ని విడుదల చేయలేదు. అదే ఇప్పుడు సిద్దార్థ అవకాశాలను దెబ్బకొట్టింది.
అవల్ సినిమా హర్రర్ మూవీ. ప్రస్తుతం కొన్నాళ్లుగా తెలుగులో హర్రర్ ట్రెండ్ నడుస్తోంది. కానీ.. హర్రర్ సినిమాలు థియేటర్లలోనే చూసేందుకు ఇష్టపడతారు ఆడియన్స్.. పైగా ఒకసారి చూసేస్తే మళ్లీ రెండోసారి వెళ్లరు. కానీ... తమిళంలో సినిమా రిలీజ్ కాగానే వెంటనే పైరసీ ఆన్ లైన్లోకి వచ్చేసింది. అది కూడా హై క్వాలిటీ ప్రింట్. తెలుగు రాష్ర్టాల్లో ఈ పైరసీ కాపీ చాలామందికి చేరిపోయింది. హర్రర్ మూవీకి భాషతో పెద్దగా పనిలేదు కాబట్టి ఇప్పుడు తమిళ వెర్షన్ చూసేసిన వారు మళ్లీ తెలుగులో ఆ సినిమా వచ్చినా థియేటర్ల వరకు వెళ్లే పరిస్థితులు ఉండవు.
తమిళనాట మంచి హిట్టనిపించుకున్న ఈ సినిమా ఆన్ లైన్లో అందుబాటులోకి వచ్చేయడంతో సిద్ధార్థ నీరసడిపోయాడట. ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేసినా వసూళ్లు పెద్దగా ఉండకపోవచ్చని భావిస్తున్నారు. అయితే... సినిమా చూసినవారు మాత్రం హాలీవుడ్ సినిమాలకు ధీటుగా ఉందని అంటున్నారు. మరి సిద్ధార్థ అదృష్టం ఎలా ఉందో చూడాలి.