Begin typing your search above and press return to search.

బాహుబలి పోతే.. అవి దెబ్బేస్తున్నాయి

By:  Tupaki Desk   |   25 May 2017 5:08 AM GMT
బాహుబలి పోతే.. అవి దెబ్బేస్తున్నాయి
X
బాహుబలి విడుదల దేశంలో ఒక పండుగ. కానీ కొందరికి వణుకు పుట్టించింది. తెలుగులో ఈ సినిమా తప్పితే వేరేది చూసింది లేదు జనం. అలానే బాహుబలి అన్ని భాషల్లో విడుదలైంది. అయిన ప్రతి చోటా అక్కడ స్థానిక చిత్రాలుకు గట్టి పోటీ ఇచ్చింది. హిందీలో కూడా అలానే జరిగింది. ఇప్పుడు ఆ భయం కాస్త తగ్గిన హాలీవుడ్ సినిమాలతో బాహుబలి లాంటి ఎఫెక్ట్ మళ్ళీ మొదలువుతోంది అని భయపడుతుంది.

బాలీవుడ్ బాక్సాఫీస్ చూసుకుంటే.. సచిన్ బయో పిక్ ఈ శుక్రవారం విడుదల అవుతుంది. దీనితో పాటుగా హాలీవుడ్ గ్రేట్ ఫ్రాంఛైజీ మూవీ ‘పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్' 5వ భాగం విడుదల కానుంది. ఇక్కడ మరో గమత్తు ఏంటంటే ఈ రెండు మూవీస్ కూడా ఇండియాలో ఉన్న ముఖ్య భాషలలో డబ్ చేస్తున్నారు. ఆ తరవాత వారం బేవాచ్, వండర్ ఉమెన్ విడుదల అవుతున్నాయి. ఇదే వారం మనీషా కోయిరాల సెకండ్ ఇన్నింగ్స్ సినిమా ‘డియర్ మాయా’ మరియు హుమ కూరేషీ నటించిన హారర్ మూవీ ‘దొబారా’ ఇంకా రాజ్ కుమార్ రావు శ్రుతి హాసన్ రొమాంటిక్ కామిడీ సినిమా ‘బెహన్ హోగి తెరి’ పోటీగా విడుదల అవుతున్నాయి. అయితే ఇవన్నీ ఇంగ్లీష్‌ సినిమాల ఈదుర గాలి నుండి తప్పించుకోవడం కష్టమే.

ఇక జూన్ 9 న టామ్ క్రూస్ బిగ్ బ్లాక్ బస్టర్ ‘ది మమ్మీ’ ఇండియాలో నాలుగు బాషలలో విడుదల అవుతుంది. ఇదే వారం సుశాంత్ సింగ్ రాజ్పుత్ కృతి సనోన్ జంటగా నటించిన ‘రాబ్తా’ విడుదల అవుతుంది. ప్రపంచీకరణ పుణ్యమా అని ఇంగ్లిష్ మూవీస్ మన దగ్గరకు నేరుగారావడం ఇప్పుడు బాలీవుడ్ సినిమాలకు పుండు మీద కారం చల్లినట్లు జరిగింది. సెన్సార్ చీఫ్ పహలజ్ నీహాలని మాట్లాడుతూ “ఈ రెండు వారాలు ఇంగ్లిష్ సినిమాలు విడుదల కావడం వలన హింది సినిమాలకు సరిపడా థియేటర్లు కూడా దొరకలేదు అని అన్నారు. సచిన్ మూవీ కి ఇది పెద్ద దెబ్బ మొదటి వారం ఒక ఇంగ్లిష్ మూవీ రెండో వారం హింది మరియు ఇంగ్లిష్ సినిమాలతో మధ్య పడి చావు దెబ్బ తినడం ఖాయం అని చెప్పారు.”

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/