Begin typing your search above and press return to search.

అన్ బ్లాక్ చేయమ‌ని బ‌తిమాలుతున్న‌ పీకే ఫ్యాన్స్

By:  Tupaki Desk   |   11 April 2021 5:38 AM GMT
అన్ బ్లాక్ చేయమ‌ని బ‌తిమాలుతున్న‌ పీకే ఫ్యాన్స్
X
`అల వైకుంఠ‌పుర‌ము`(2020)లో రిలీజ్ ముందు .. రిలీజ్ త‌ర్వాతా థ‌మ‌న్ స‌న్నివేశం తెలిసిందే. అంత‌కుముందు ఇండ‌స్ట్రీలో ఏ ఇత‌ర సంగీత ద‌ర్శ‌కుడిపై లేన‌న్ని విమ‌ర్శ‌ల్ని థ‌మ‌న్ ఎదుర్కొన్నారు. అత‌డు కాపీ క్యాట్ సంగీత ద‌ర్శ‌కుడు అని త‌న ట్యూన్స్ తానే కాపీ కొడ‌తాడ‌ని తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు చేశారు. కానీ ఇప్ప‌టి స‌న్నివేశం అందుకు పూర్తి భిన్నం. అల వైకుంఠ‌పుర‌ములో సాంగ్స్ చార్ట్ బ‌స్ట‌ర్లు గా నిలిచాయి. ఇప్ప‌టికీ సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌.. బుట్ట‌బొమ్మ‌... ట్రెండింగులో ఉన్నాయి.

అలాగే వ‌కీల్ సాబ్ నుంచి ఓ మ‌గువా సాంగ్ స‌హా ప‌లు పాట‌లు ట్రెండ్ సెట్ట‌ర్లుగా నిలిచాయి. ఇప్ప‌టికీ చార్ట్ బ‌స్ట‌ర్లు గా కొన‌సాగుతున్నాయి. వ‌కీల్ సాబ్ ఇటీవ‌ల విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ తెచ్చుకోవ‌డ‌మే గాక‌.. ఈ సినిమా మ్యూజిక్ రీరికార్డింగ్ కి ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ద‌క్కింది. సినీప్ర‌ముఖులు స‌హా కామ‌న్ ఆడియెన్ సైతం థ‌మ‌న్ ప‌నిత‌నాన్ని పొగిడేస్తున్నారు. వ‌కీల్ సాబ్ ని థ‌మ‌న్ త‌న‌దైన రీరికార్డింగ్ తో ఓ రేంజుకు తీసుకెళ్లాడ‌ని బ్లాక్ బ‌స్ట‌ర్ ఘ‌న‌త అత‌డికే చెందుతుంద‌ని పొగిడేస్తున్నారు.

త‌న ఫేవ‌రెట్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు సంవత్సరాల తరువాత కంబ్యాక్ అవుతున్న మూవీ కాబ‌ట్టి వ‌కీల్ సాబ్ ని ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్న థ‌మ‌న్ ఎంతో హార్డ్ వ‌ర్క్ చేశారు. సాటి అభిమానుల కోరికను అతను అర్థం చేసుకుని ఈ చిత్రంలో అవసరమైన చోట తన‌దైన రీరికార్డింగ్ తో సినిమా ఎమోషన్ ను ఒక స్థాయికి ఎత్తాడు. మెట్రో రైలు ఫైట్ బీజీఎం కానీ.. బాత్రూమ్ ఫైట్ బీజీఎం కానీ లేదా. కోర్ట్-రూమ్ డ్రామా నేప‌థ్య సంగీతానికి కానీ గొప్ప ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఇంకా ఈ సినిమాలో థ‌మ‌న్ మెరుపులు చాలా చోట వ‌ర్క‌వుట్ అయ్యాయి.

ఇక ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు అయితే త‌మ‌ను సోష‌ల్ మీడియాల్లో బ్లాక్ చేసిన థ‌మ‌న్ వెంట‌నే అన్ బ్లాక్ చేయాల‌ని ప్రాధేయ‌ప‌డుతున్నారు. నిజానికి ప‌వ‌న్ సినిమాకి థ‌మ‌న్ ని మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా ప్ర‌క‌టించ‌గానే ఒక సెక్ష‌న్ అభిమానుల నుంచి వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది. కొంద‌రు సోష‌ల్ మీడియాల్లో దురుసుత‌నం చూపించడంతో వారిని థ‌మ‌న్ బ్లాక్ చేశారు. కానీ ఇప్పుడు అన్ బ్లాక్ చేయాల్సిందిగా అభ్య‌ర్థ‌న‌లు పోటెత్తుతున్నాయి.

థ‌మ‌న్ ప్ర‌తిసారీ విమ‌ర్శ‌ల్ని తిప్పి కొట్టేందుకు ఎంతో హార్డ్ వ‌ర్క్ చేస్తున్నారు. త‌న‌దైన సృజ‌న‌తో మెప్పించి ప్రాక్టిక‌ల్ గా ఆన్స‌ర్ ఇస్తున్నారు. ఇప్పుడు సౌతిండియాలోనే అత్యంత విజ‌య‌వంత‌మైన సంగీత ద‌ర్శ‌కుడిగా ఓ వెలుగు వెలుగుతున్నారు. ఈ స్పీడ్ ని అత‌డు ఇక‌పైనా కొన‌సాగిస్తారనే అభిమానులు భావిస్తున్నారు. ఇక ఏ.ఆర్. రెమ‌మాన్ అంత‌టి వాడినే కాద‌ని చ‌రణ్ మూవీ కోసం థ‌మ‌న్ ని శంక‌ర్ ఎంపిక చేశారంటే అర్థం చేసుకోవ‌చ్చు. రాజీ అన్న‌దే లేని శంక‌ర్ కూడా అల వైకుంఠ‌పుర‌ములో పాట‌లు విన్న త‌ర్వాత థ‌మ‌న్ ని ఎంపిక చేసుకున్నార‌ని నిర్మాత‌ల అభ్య‌ర్థ‌న విన్నార‌ని చెప్పుకోవ‌డం ఆస‌క్తిగా మారింది.