Begin typing your search above and press return to search.
కొత్త టెక్నీషియన్ తో మొదలైన పీకే 'ఏకే' మూవీ
By: Tupaki Desk | 26 July 2021 7:02 AM GMTపవన్ కళ్యాణ్ నటిస్తున్న రెండు సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. ఆ రెండు సినిమాలు కూడా ఈ ఏడాదిలోనే పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో పవన్ ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. కరోనా వల్ల సెకండ్ వేవ్ కు కాస్త ముందే షూటింగ్ లకు పవన్ దూరం అయ్యాడు. ఈ నెల రెండవ వారంలో మళ్లీ షూటింగ్ కు జాయిన్ అవ్వాలని అనుకున్నాడు. అయితే దర్శకుడు సాగర్ చంద్ర మరియు సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మూరెళ్ల ల మద్య చిన్న విభేదాలు ఉన్నాయని.. దాంతో ఆయన సినిమా నుండి తప్పుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. ప్రసాద్ తప్పుకోవడంతో షూటింగ్ చివరి నిమిషంలో క్యాన్సిల్ అయ్యింది. షూటింగ్ ను ఎట్టకేలకు కొత్త సినిమాటోగ్రాఫర్ తో పునః ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరిగాయి.
నేటి నుండి పవన్ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ షూటింగ్ పునః ప్రారంభం అయ్యింది. రవి కే చంద్రన్ ఈ సినిమా కు కొత్త సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ పై గతంలో తెరకెక్కించిన కొన్ని సన్నివేశాలను మళ్లీ తెరకెక్కించేందుకు సిద్దం అయ్యారు అంటూ వార్తలు వచ్చాయి. ఆ విషయం పై చిత్ర యూనిట్ సభ్యుల నుండి ఎలాంటి క్లారిటీ లేదు. కొత్త టెక్నీషియన్ రాకతో షూటింగ్ మొదట రెండు మూడు రోజులు స్లోగా సాగుతుందని అంటున్నారు. షూటింగ్ పునః ప్రారంభించినట్లుగా చిత్ర టీమ్ క్లారిటీ ఇచ్చింది. హైదరాబాద్ లో పవన్ తో పాటు కీలక నటీ నటులు ఈ షూటింగ్ లో పాల్గొంటున్నట్లుగా సమాచారం అందుతోంది.
ఈసినిమా షూటింగ్ ను వచ్చే నెలలో ముగించే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు సినిమా ను పవన్ మొదలు పెట్టబోతున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా షూటింగ్ ను ఈ ఏడాదిలో ముగించాలని చాలా బలంగా పవన్ కోరుకుంటున్నాడు. కరోనా సెకండ్ వేవ్ వల్ల అయ్యప్పనుమ్ కోషియుమ్ ఆలస్యం అవుతుంది. లేదంటే ఇప్పటికే షూటింగ్ ముగిసేది అంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కు రచయితగా త్రివిక్రమ్ వ్యవహరిస్తున్న కారణంగా అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తాడా చూడాలి. ఇక క్రిష్ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో తెల్సిందే.
ఆ సినిమా ఛారిత్రాత్మక నేపథ్యం మూవీ అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు అలాంటి నేపథ్యంలో సినిమా లు చేయలేదు. కనుక పవన్ కు ఆ నేపథ్యం ఎలా ఉంటుందా అంటూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే విడుదల అయిన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కనుక సినిమా కూడా తప్పకుండా పవన్ కెరీర్ లో టాప్ చిత్రంగా నిలుస్తుందనే నమ్మకంను యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా పవన్ వచ్చే ఏడాది మరో రెండు మూడు సినిమాలను కూడా చేయబోతున్నాడు. రాజకీయాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా పవన్ మాత్రం వరుసగా సినిమాలను చేస్తూనే ఉంటాను అంటూ ఇటీవల ప్రకటించిన విషయం తెల్సిందే.