Begin typing your search above and press return to search.
వీరమల్లు పూర్తయ్యే వరకూ పీకే నో పాలిటిక్సా?
By: Tupaki Desk | 26 Nov 2022 2:30 AM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో `హరిహర వీరమల్లు` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈసినిమా షూటింగ్ ప్రారంభమై రెండేళ్లు అవుతుంది. కానీ ఇంత వరకూ చిత్రీకరణ కూడా పూర్తికాలేదు. ఈ సినిమా విషయంలో పీకే అంత సీరియస్ గానూ కనిపించలేదు. ఈసినిమా ప్రారంభమైన దగ్గర నుంచి రెండు పడవల ప్రయాణాన్ని కొనసాగించారు. పార్ట్ టైమ్ సినిమా...ఫుల్ టైమ్ రాజకీయాలు అంటూ బిజీ అయ్యారు.
ఇదే సమయంలో భీమ్లా నాయక్ సినిమా కూడా కమిట్ అయ్యారు. కానీ ఈ సినిమా ని మాత్రం వేగంగానే పూర్తిచేసి రిలీజ్ చేసారు. కానీ వీరమల్లు విషయంలో మాత్రం అంత శ్రద్ద పెట్టలేదు. దానికి తోడు తొందరగా హడావుడిగా పూర్తిచేసే ప్రాజెక్ట్ కూడా కాదు. దీంతో పవన్ ఈ సినిమాకి డేట్లు సర్దుబాటు చేయడంలో కొంత జాప్యం జరిగింది. ఆ తర్వాత ఏపీలో రాజకీయ కాక ముదరడంతో పీకే జనల్లో తిరగడం మొదలు పెట్టారు.
మొన్నటివరకూ అదే పనిలో ఉన్నారు. ఇలా వీరమల్లు విషయంలో చాలా ఆలస్యమే జరిగింది. అయినా క్రిష్ ఎంతో ఓపికగా ఉంటూ సినిమాని పూర్తి చేస్తున్నారు. పీకే షూటింగ్ మధ్యలో వెళ్లిపోయినా కామ్ గా ఉంటూ పీకే లేని సీన్స్ షూట్ చేస్తున్నారు. కొన్ని రోజులు గా రామోజీ ఫిలిం సిటీలోనే షూటింగ్ జరుగుతోంది. 900 మంది ఈ షెడ్యూల్ కోసం పనిచేస్తున్నారు.
అలాగే పీకే కూడా ఈ షెడ్యూల్ ని సీరియస్ గానే తీసుకుని ముందుకు సాగుతున్నారు. అయితే ఇదే సీరియస్ నెస్ సినిమా పూర్తయ్యే వరకూ ఇకపై కొనసాగుతుందని క్రిష్ కి ప్రామిస్ చేసారుట పీకే. ఇప్పటికే షూటింగ్ బాగా ఆలస్యమైన నేపథ్యంలో ఇకపై నో పాలిటిక్స్..ఓన్లీ వీరమల్లు అంటున్నారుట.
ఇప్పటివరకూ మాట తప్పినా ఇకపై మాత్రం షూటింగ్ విషయంలో మాట తప్పనని...తమకు అవసరమైన అన్ని వేళలా అందుబాటులో ఉంటానని.. అవసరమైతే రాత్రుళ్లు కూడా సమయం కేటాయిస్తానని...ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా పూర్తిచేయమని అభయహస్తం ఇచ్చారుట పీకే. దీంతో క్రిష్ ఇక చెలరేగడమే ఆలస్యమని తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.