Begin typing your search above and press return to search.

పవర్ స్టార్ సినిమాలో 'డ్రైవర్'గా సీనియర్ యాక్టర్..?

By:  Tupaki Desk   |   12 Jun 2021 7:30 AM GMT
పవర్ స్టార్ సినిమాలో డ్రైవర్గా సీనియర్ యాక్టర్..?
X
తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం 'రీమేక్' మూవీస్ ట్రెండ్ బాగానే నడుస్తోంది. ఆల్రెడీ వేరే భాషలో సూపర్ హిట్ అయిన సినిమానే రీమేక్ చేస్తారు కాబట్టి రీమేక్ సినిమాలలో ప్లాప్స్ కంటే హిట్, సూపర్ హిట్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే ఇలా రీమేక్ సినిమాలు తెలుగులో కూడా వర్కౌట్ అవుతుండటంతో హిట్స్ లేని హీరోలంతా రీమేక్స్ బాటపడుతున్నారు. ఇంకా మరోవైపు మల్టీస్టారర్ సినిమాలు కూడా టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుండటంతో వేరే హీరోతో కలిసి వర్క్ చేయడానికి హీరోలు సిద్ధంగానే ఉంటున్నారు. ఇక గతేడాది మలయాళంలో రిలీజై సూపర్ హిట్ అయిన సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియం’.

ఈ సినిమా ఇప్పుడు తెలుగులో నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో రీమేక్ చేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో షూటింగ్ ప్రారంభమైంది కానీ ఇంతవరకు సినిమా పూర్తికాలేదు. అయితే ఈ యాక్షన్ డ్రామా మూవీ కేవలం ఇద్దరు వ్యక్తుల చుట్టూనే తిరుగుతుంది. మద్యానికి బానిసైన ఒక రిటైర్డ్ హవాల్దారుకి, అతన్ని అరెస్ట్ చేసిన పోలీస్ అధికారికి మధ్య రగిలిన బలమైన ఇగోల చుట్టూ ఈ సినిమా కథాంశం సాగుతుంది. ఈ సినిమాలో పోలీస్ అయ్యప్పన్ పాత్రలో బిజుమీనన్, కోషి పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించాడు. అయితే తెలుగు రీమేక్ పృథ్వీరాజ్ పాత్రలో రానా, అయ్యప్పన్ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నాడు.

తాజాగా ఈ సినిమాలో మరో క్యారెక్టర్ గురించి వార్తలు బయటికి వస్తున్నాయి. ఈ సినిమాలో రానా పాత్రకు ఓ డ్రైవర్ ఉంటాడు. అది డ్రైవర్ పాత్రే అయినప్పటికీ సినిమాలో కీలకంగా ఉంటుంది. మరి ఇప్పుడు ఆ క్యారెక్టర్ సీనియర్ యాక్టర్ బ్రహ్మాజీ పోషించనున్నట్లు సమాచారం. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ ఆయనే ఫిక్స్ అయినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. చూడాలి మరి కొంతకాలంగా బ్రహ్మాజీ సరైన బ్రేక్ రాక ఇబ్బంది పడుతున్నాడు. ఈ సినిమా క్యారెక్టర్ పై నమ్మకం పెట్టుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాకు త్రివిక్రమ్ రచనలో భాగం కాగా సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. తమన్ రెండోసారి పవన్ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.