Begin typing your search above and press return to search.
వీరమల్లు కోసం పీకే స్టంట్స్!
By: Tupaki Desk | 30 Dec 2022 6:05 AM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా 'హరిహర వీరమల్లు' ఇటీవలే 40 రోజుల లాంగ్ షెడ్యూల్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. రామోజీ ఫిలిం సిటీలో జరిగిన ఈ షూటింగ్ లో పవన్ తో పాటు ప్రధాన తారాగణమంతా పాల్గొన్నారు. ఇందులో భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. వీటిని స్టంట్ మాస్టర్ విజయ్ ఆధ్వర్యంలో పూర్తి చేసారు. సినిమాలో ఈసన్నివేశాలు ప్రత్యేకా కర్షణగా నిలవనున్నాయి.
ఈ షెడ్యూల్ కి బడ్జెట్ భారీగానే ఖర్చు చేసారుట. షెడ్యూల్ ప్రారంభానికి ముందు నిర్వహించిన వర్క్ షాప్స్ లో సైతం పీకే పాల్గొన్నారు. ఇలా 40 రోజుల షూట్ లో పవన్ కీలకంగా మారారు. మరి ఇదే సినిమా కోసం పీకే స్టంట్ మాస్టర్ గానూ మారిపోయారా? యాక్షన్ సన్నివేశాల కోసం విజయ్ తో కలిసి స్టంట్స్ కొరియోగ్రఫీ చేసారా? అంటే అవుననే వినిపిస్తుంది.
దాదాపు 20 ఏళ్ల క్రితం నాటి మార్షల్ ఆర్స్ట్ ని మళ్లీ పీకే తెరపైకి తెచ్చినట్లు సమాచారం. మార్షల్ ఆర్స్ట్ విద్యలో పీకే ఆరితేరాడు. కెరీర్ ఆరంభంలో ఆయన చేసిన సాహసాలు తెలిసిందే. 'జానీ' సినిమాకు తానే స్టంట్స్ కొరియోగ్రఫీ చేసాడు. ఇంకా అవసరమైన అన్ని సందర్భాల్లోనూ పీకే సొంత క్రియేటివిటీ వాడిన సందర్భాలున్నాయి. మళ్లీ ఇంత కాలానికి మార్షల్ ఆర్స్ట్ అవసరం పడటంతో? పవన్ మళ్లీ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
హరి హరి వీరమల్లు కొన్ని కీలక సన్నివేశాలకు పవన్ స్వయంగా యాక్షన్ సీన్స్ డిజైన్ చేసారుట. వాటిని విజయ్ తోకలిసి కొరియోగ్రఫీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ లో మార్షల్ ఆర్స్ట్ ఫోజులో పీకే హైలైట్ అవుతున్నారు. కత్తి తిప్పడం...తలకాయ..మెడ మీద నుంచి కత్తి దూయడం వంటి సన్నివేశాలన్ని పీకే క్రియేటివిటీగానే కనిపిస్తున్నాయి. మొత్తానికి వీరమల్లు లో పీకే హస్తం ఈరకంగానూ కీలకంగానే మారినట్లు కనిపిస్తుంది. ఇంకా మును ముందు షూట్ చేయాల్సిన యాక్షన్ వేశాల్లోనూ పీకే భాగస్వామ్యం ఉంటుందా? అన్నది చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.