Begin typing your search above and press return to search.
విరాట పర్వం రిలీజ్ కి ప్లాన్ 'బి'
By: Tupaki Desk | 16 Nov 2021 1:09 PM GMTరానా హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందిన విరాటపర్వం సినిమా విడుదల కోసం ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదల అయిన ఈ సినిమా ప్రోమోలు.. పోస్టర్ లు మరియు పాటలు అన్ని కూడా సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. గత రెండేళ్లుగా ఈ సినిమా గురించిన చర్చ సోషల్ మీడియాలో జరుగుతూనే ఉంది. పెద్ద ఎత్తున అంచనాలున్న విరాటపర్వం సినిమా విడుదల తేదీలు ఇప్పటికే చాలా వచ్చాయి.. ఏవో కారణాల వల్ల సినిమా వాయిదా పడుతూ వచ్చింది. థియేటర్లు ఆమద్య ఓపెన్ లేకపోవడంతో విరాటపర్వంను ఓటీటీ కి ఇచ్చేయాలనే నిర్ణయానికి నిర్మాతలు వచ్చినట్లుగా ప్రచారం జరిగింది.
ఆ సమయంలో మేకర్స్ కూడా తప్పని పరిస్థితుల్లో ఓటీటీకి వెళ్లాల్సి వస్తుంది. ఇష్టం లేకుండానే ఓటీటీకి ఈ సినిమాను ఇవ్వబోతున్నాం అంటూ అనధికారికంగా ప్రకటించారు. కాని కొన్ని కారణాల వల్ల ఓటీటీ రిలీజ్ కూడా వాయిదా పడింది. ప్రస్తుతం థియేటర్లు పూర్తి స్థాయిలో మునుపటిలా రన్ అవుతున్నాయి. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తే వందల కోట్ల వసూళ్లు నమోదు అవుతున్నాయి. కనుక విరాటపర్వం సినిమాను థియేటర్ రిలీజ్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది. కనుక ముందుగానే ఓటీటీ వారితో విడుదల సమయంకు థియేటర్లు ఓపెన్ అయితే థియేటర్ రిలీజ్ కు వెళ్తామని.. ఆ తర్వాతే ఓటీటీ స్ట్రీమింగ్ కు ఇస్తామని ఒప్పందం చేసుకున్నారట. అందుకే ఇప్పుడు ప్లాన్ బి కి వెళ్లబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.
సురేష్ బాబు ఇప్పటికే నారప్ప సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేయడం వల్ల విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు దృశ్యం 2 కూడా ఓటీటీ కి వెళ్తున్న నేపథ్యంలో ఆయన్ను విమర్శిస్తున్నారు. ఇప్పుడు విరాట పర్వం కూడా ఓటీటీకి వెళ్తే ఖచ్చితంగా మరింతగా విమర్శలు ఎదురయ్యే అవకాశం ఉందని.. అందుకే సురేష్ బాబు విరాటపర్వం ను థియేటర్ రిలీజ్ కు వెళ్లాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. విరాటపర్వం సినిమా లో సాయి పల్లవి ఉండటంతో పాటు ఒక మంచి సబ్జెక్ట్ తో సినిమా రూపొందడం వల్ల థియేటర్ రిలీజ్ లాభం చేకూర్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ఒకటి రెండు వారాల్లో విరాటపర్వం సినిమా థియేటర్ రిలీజ్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందంటున్నారు.