Begin typing your search above and press return to search.
లూసిఫర్ రీమేక్ లో అలా ఒక సీన్ ప్లాన్ చేశారట లేదా
By: Tupaki Desk | 13 Aug 2021 4:35 AM GMTమలయాళంలో సూపర్ హిట్ అయిన మూవీ లూసిఫర్. ఆ మాటకు వస్తే.. అదే పేరుతో తెలుగులోనూ విడుదలైంది. ఎప్పుడు సినిమా రిలీజ్ అయ్యిందో.. ఎప్పుడు డబ్బాలు వెనక్కి వెళ్లిపోయాయో కూడా ఎవరూ పెద్దగా గుర్తించలేదు. అలాంటి సినిమా మీద మెగాస్టార్ చిరంజీవి మనసు పడటం తెలిసిందే. తెలుగులో విడుదలైన డబ్బింగ్ మూవీ స్థానే.. తనదైన ముద్ర చూపించేలా రీమేక్ కు ప్లాన్ చేశారు.
ఈ సినిమాను చిరుతో రీమేక్ చేస్తున్నారన్నంతనే ఓటీటీలో ఈ సినిమాను భారీగా చూసేయటం జరిగింది. అయితే.. కథ మీద ఉన్న నమ్మకం.. దీనికి తోడు హీరోయిజం ఒక రేంజ్ లో ఎలివేట్ అయ్యేలా ఉంటుందీ సినిమా. ఎప్పుడెప్పుడా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతాయని ఎంతో ఆసక్తిగా ఎదురుస్తున్నారు. మోహన్ రాజాతో ఈ సినిమాను తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ మ్యూజిక్ ఇవ్వనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను ఏపీలోని పోర్టు నగరంగా పేరున్న కాకినాడ లో చేపట్టనున్నట్లు చెబుతున్నారు.
గురువారం విశాఖపట్నంలో ఉన్న మెగాస్టార్.. శుక్రవారం ఉదయం కాకినాడకు చేరుకుంటారని చెబుతున్నారు. పోర్టులో ఒక కీలక సన్నివేశాన్ని ప్లాన్ చేశారని.. దాన్ని షూట్ చేయనున్నట్లు చెబుతున్నారు. దీంతో లూసిఫర్ రీమేక్ షూటింగ్ మొదలైనట్లు అవుతుందని చెబుతున్నారు.
ఈ సినిమా మీద ఇప్పటికే భారీ బజ్ నెలకొన్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్.. సూపర్ గుడ్ ఫిలిమ్స్.. ఎన్ విఆర్ ఫిలిమ్స్ బ్యానర్ల మీద ఉమ్మడిగా రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ను నాలుగు నెలల్లో పూర్తి చేయాలని ప్లాన్ చేసినట్లుగా చెబుతున్నారు. మెగాస్టార్ ను మరో రేంజ్ లో చూపించేలా ఈ సినిమాకు కొన్ని మార్పులు చేసినట్లుగా చెబుతున్నారు. మొత్తంగా మెగా అభిమానులకు పండుగలాంటి సమాచారంగా చెప్పక తప్పదు.