Begin typing your search above and press return to search.

చివ‌రివ‌ర‌కూ నాటౌట్ అవ్వాల‌ని ప్లాన్ చేశార‌ట

By:  Tupaki Desk   |   14 Dec 2020 1:30 AM GMT
చివ‌రివ‌ర‌కూ నాటౌట్ అవ్వాల‌ని ప్లాన్ చేశార‌ట
X
``మేము చివరి వరకు నాట్ అవుట్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నాం`` అంటూ టీమిండియా స్టైలిష్ బ్యాట్స్ మ‌న్ రోహిత్ శ‌ర్మ‌- రితిక స‌చ్ దేవ్ జంట చెబుతున్నారు. త‌మ ఐద‌వ‌ వివాహ వార్షికోత్సవం సందర్భంగా రోహిత్ శర్మ రితిక ఒక‌రికొక‌రు ప్రత్యేక సందేశం ఇచ్చుకున్నారు. ఇన్ ‌స్టాగ్రామ్ ‌లో ఈ ముచ్చ‌టైన జంట‌ అందమైన క్యాప్షన్ ‌తో ఫోటోల్ని పంచుకున్నారు.

రోహిత్ శర్మ - రితికా వైవాహిక జీవితం ఐదు సంవత్సరాలు పూర్త‌యింది. ప్ర‌స్తుతం టెస్ట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న రోహిత్,.. తన భార్యతో క‌లిసి ఉన్న ఫోటోల‌ను పంచుకున్నాడు. రోహిత్ ఈ సంద‌ర్భంగా ఒక అందమైన సందేశాన్ని రాశాడు. ``5 సంవత్సరాల ఆప్యాయత .. చివరి వరకు నాట్ అవుట్ గా ఉండాలని మేము ప్లాన్ చేస్తున్నాం`` అని రోహిత్ ఇన్ ‌స్టా‌లో రాశారు. ఐపిఎల్ ఫ్రాంచైజ్ ముంబై ఇండియన్స్ టీమ్ ఈ పోస్ట్ పై స్పందించి స్టార్ క‌పుల్ కు శుభాకాంక్షలు తెలిపారు.

తన ఐదవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా రితికా కూడా ఇన్‌స్టాగ్రామ్ లో తన భర్త మాదిరిగానే ఐదు చిత్రాలను పంచుకుని వాటికి ఒక అందమైన శీర్షికను ఇచ్చారు. ``హ్యాపీ 5 మై లవ్ .. భవిష్యత్ జీవితకాలమంతా నేను మిమ్మ‌ల్ని డిబ్స్ అని పిలుస్తాను`` అంటూ ఎమోష‌నల్ గా స్పందించారు.

2013 నుండి రోహిత్ నాయకత్వంలో ఐదు ఐపిఎల్ టైటిల్స్ గెలుచుకున్న ముంబై ఇండియన్స్ కెప్టెన్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ట్వీట్ల ద్వారా శుభాకాంక్ష‌లు తెలిపారు. 13 డిసెంబర్ 2015 నుంచి రోహిత్ - రితిక ఉత్తమ భాగస్వామ్యం ప్రారంభమైంది. వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా రోహిత్ - రితిక కు ప్రేమ పూర్వ‌క శుభాకాంక్ష‌లు `` అని ముంబై ఇండియన్స్ ట్వీట్ చేశారు.