Begin typing your search above and press return to search.
పవన్ ఫ్యాన్స్ @ మొక్కలు + సెల్ఫీ
By: Tupaki Desk | 1 Sep 2015 9:25 AM GMTమెగా సంబరాలు ఇటీవలే ముగిశాయి. మెగాస్టార్ చిరంజీవి 60వ పుట్టినరోజు వేడులు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్ని ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నారు అభిమానులు. అయితే ఇక్కడితో ఈ సెలబ్రేషన్స్ ఆగిపోయినట్టు కాదు. మునుముందు పండుగే పండుగ. చరణ్ 'బ్రూస్ లీ', వరుణ్ తేజ్ 'కంచె', సాయిధరమ్ 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' సంబరాల్ని కంటిన్యూ చేయడానికి రెడీ అవుతున్నాయి. ఈలోగానే కాస్త సందడి చేయడానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 44వ పుట్టిన రోజు సెప్టెంబర్ 2న (రేపు)ఉండనే ఉంది.
మెగా ఫ్యాన్సు, పవన్ ఫ్యాన్సును కలిపి చూసినా, విడదీసి చూసినా కూడా.. అభిమానుల్ని ఫుల్ ఖుషీ చేసే వేడుక ఇది. కాకపోతే అన్నయ్య తరహాలోనే పవన్ అంతే ఘనంగా ఉత్సవాల్ని జరుపుకునే అవకాశం లేదు. పవన్ ఇలాంటి వేడుకలకు కాస్త అననుకూలం. కాబట్టి అతడు ముందు నుంచే ఓ స్లోగన్ అందుకున్నాడు. అయితే అన్నయ్య రెగ్యులర్ గా రక్తదానం, అన్నదాం వంటి ప్రోగ్రామ్ లు తన అభిమానులుతో చేయిస్తుంటారు.. అదేలేండి ఎంకరేజ్ చేస్తుంటారు.. ఇకపోతే పవన్ కూడా అలాగే ఆలోచించి ఏదైనా డైరక్షన్ ఇచ్చుంటాడా తన అభిమానులకి?
పవన్ బర్త్ డే రోజు ఒక మొక్క నాటండి, దాంతో సెల్ఫీ దిగండి అంటూ ఇప్పుడు పవన్ అభిమానులు ప్రచారం చేస్తున్నారు. ప్లాంట్ ఎ ట్రీ.. అండ్ టేక్ ఎ సెల్ఫీ అంటూ ఈ ఇచ్చిన సందేశం ఫ్యాన్స్ లోకి దూసుకెళ్లిపోతోంది. రక్తదానం, ఐ డొనేషన్ లానే మొక్కల్ని పెంచడం ఎంతో అవసరం అన్న సందేశాన్ని పవన్ అందరిలోకి పంప్ చేసినట్లున్నాడు. అసలే ఫామ్ హౌస్ లో మెక్కలు, తోటలు, పొలాలు పెంచే రైతు ఆయన. అందుకేనేమో ఈ ప్లాంట్ ఏ ట్రీ ప్రోగ్రాం కు స్పందన బాగానే ఉంది. కాకపోతే మొక్కలు కొనడం, ఏదైనా స్థలం వెతికి పాతడం కాస్త ఖర్చుతో కూడుకున్నదే.