Begin typing your search above and press return to search.

డార్లింగ్ పెళ్లికి వెళ్లిన త‌మన్నా

By:  Tupaki Desk   |   8 May 2018 6:59 AM GMT
డార్లింగ్ పెళ్లికి వెళ్లిన త‌మన్నా
X
టాలీవుడ్లో డార్లింగ్ అంటే వెంట‌నే గుర్తొచ్చేది యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌. కాబ‌ట్టి డార్లింగ్ పెళ్లికెళ్లింది అన‌గానే ప్ర‌భాస్ పెళ్లికి అనుకోకండి. ప్ర‌భాస్ కాదు... త‌మ‌న్నా ప్రేమ‌గా డార్లింగ్ అని పిలుచుకునే ఆమె స్నేహితురాలు క‌మ్ డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ క‌మ్ ప్లేబ్యాక్ సింగ‌ర్ మ‌న‌సి ఈమ‌ధ్య‌నే పెళ్లి చేసుకుంది. ఆమె పెళ్లికి అనుకోని అతిథిగా వెళ్లి దంప‌తుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచింది తమ‌న్నా.

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా అందంలోనే కాదు... న‌ట‌న‌లోనూ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుని ఆక‌ట్టుకుంది. తెర మీద వినిపించే ఆమె అద్దె స్వరానికి కూడా మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. ‘బాహుబ‌లి- ది బిగినింగ్‌’ సినిమాలో త‌మ‌న్నా అదిరిపోయే యాక్టింగ్ కి త‌న డ‌బ్బింగ్ తో మ‌రింత గ్లామ‌ర్ తీసుకొచ్చింది మాన‌సి. ఈ అమ్మ‌డితో త‌మ్మూకి మంచి దోస్తీనే ఉంది. బాహుబ‌లి సినిమాతో పాటు ‘ఊపిరి’- ‘అభినేత్రి’ వంటి తెలుగు సినిమాల‌తో పాటు ‘దేవి’- ‘ధ‌ర్మ‌దురై’ వంటి చాలా సినిమాల్లో గొంతు అందించింది మాన‌సి. ఆ ప‌రిచ‌యంతోనే ఇద్ద‌రి మ‌ధ్య మంచి స్నేహం ఏర్ప‌డింది. మే 5న‌ డాక్ట‌ర్ అభినాష్ ను పెళ్లి చేసుకున్న మాన‌సికి శుభాకాంక్ష‌లు చెప్పేందుకు సర్ప్రైజ్ విజిట్ చేసింది త‌మ్మూ.

అంతేకాకుండా ట్వీట్ట‌ర్ ద్వారా కూడా ఈ న‌వ దంపుతుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపింది త‌మ‌న్నా. చెన్నై వాస్త‌వ్యురాలు అయిన మాన‌సి తెలుగు- త‌మిళ‌- క‌న్న‌డ‌- మ‌ల‌యాళం- హిందీ- ఇంగ్లీషు భాష‌ల్లో 70కి పైగా పాట‌లు పాడింది మాన‌సి.