Begin typing your search above and press return to search.

MAA వార్.. చంద్రబాబు గారు బంధువు.. జగన్ బావగారు.. కానీ!

By:  Tupaki Desk   |   24 Sep 2021 2:30 PM GMT
MAA వార్.. చంద్రబాబు గారు బంధువు.. జగన్ బావగారు.. కానీ!
X
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. ప్ర‌కాష్ రాజ్ వ‌ర్సెస్ మంచు విష్ణు వార్ కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే విందు రాజ‌కీయాలు ప‌రాకాష్ట‌కు చేరుకున్నాయి. కేవ‌లం 950 ఓట్లు ఉన్న ఈ అసోసియేష‌న్ హ‌డావుడి పెద్ద స్థాయిలో చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఒక సెక్ష‌న్ మీడియా మా ఎన్నిక‌ల పేరుతో టీర్పీలు గుంజుతోంద‌ని కూడా కామెం్లు వినిపిస్తున్నాయి.

చాలా ముందే ప్ర‌కాష్ రాజ్ త‌న ప్యానెల్ ని ప్ర‌క‌టించి ఎన్నిక‌ల వేడిని పెంచ‌గా.. ఇప్పుడు మంచు విష్ణు కూడా త‌న ప్యానెల్ ని ప్ర‌క‌టించి హీటెక్కిస్తున్నారు. మా అసోసియేష‌న్ లో మార్పులు తెస్తాన‌ని.. ప్ర‌తి స‌భ్యుడికి మెడి క్లెయిమ్ ఏర్పాటు చేస్తాన‌ని హామీనిచ్చారు. మా సంఘం గ్రూపులుగా విడిపోయి రాజ‌కీయాలు చేయ‌డం బాలేద‌ని అన్నారు. ప్ర‌తి ఒక్క‌రూ ఈసారి ఎన్నిక‌ల్లో ఇబ్బందుల‌కు గుర‌వుతున్నార‌ని అన్నారు. చాలా వ‌ర‌కూ ఏక‌గ్రీవం కోస‌మే ప్ర‌య‌త్నించాన‌ని కూడా విష్ణు అన్నారు.

ఎన్నికల తీరుపై ఎవరూ హ్యాపీగా లేరని ఎన్నికల గురిం‍చి మీడియా.. సోషల్‌ మీడియాలో రకరకాల వార్తలు రావడం బాధాకరమని కూడా అన్నారు. త‌న ప్యానెల్ లో ఆడాళ్ల‌కు పెద్ద పీట వేస్తాన‌ని మంచు విష్ణు అన్నారు. పెద్దలకు సెక్యూరిటీ ఇవ్వటమే ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు.

ఆర్టిస్టుల సొంత భ‌వంతిని తాను సొంత డ‌బ్బుల‌తో నిర్మిస్తాన‌ని ప్రక‌టించిన మంచు విష్ణు.. అందులో మల్టీప్లెక్స్.. కళ్యాణ మండపం కట్టనని తేల్చి చెప్పారు. ప‌దవిలో ఉన్నా లేక‌పోయినా సేవ‌లు చేస్తాను. స‌మ‌స్య‌లు ఉంటే కూచుని మాట్లాడుకుందామ‌ని విష్ణు అన్నారు.

ఇక రాజ‌కీయ పార్టీల జోక్యంపైనా విష్ణు స‌ర‌దాగా సెటైర్లు వేసారు. ``బాబు మోహన్ అంకుల్ బీజేపీ.. మాదాల రవి కమ్యూనిస్ట్ పార్టీ… ఇంకా టీఆర్ఎస్.. టీడీపీ వాళ్లు కూడా ఉన్నారు. మాకు చంద్రబాబు గారు బంధువు. వైఎస్ జగన్ బావగారు అవుతారు. కేటీఆర్ మంచి ఫ్రెండ్.. అన్ని పార్టీల వారూ మా ప్యానెల్ లో ఉన్నారు. దండం పెడుతున్నాను.. పొలిటికల్ పార్టీలను ఇందులోకి లాగకండి.. ఏ పార్టీని అయినా ఎన్నుకునే స్వేచ్చ ఉంది.. ఆర్టిస్టుల ఎన్నిక‌ల‌ను రాజ‌కీయ పార్టీల‌తో ముడి వేయ‌కండి అని మంచు విష్ణు అన్నారు.

26 మందితో ప్యానెల్ ని విష్ణు ప్ర‌క‌టించారు. మంచు విష్ణు అధ్యక్ష పదవికి.. జనరల్‌ సెక్రటరీగా రఘుబాబు పోటీ చేస్తారు. వైస్‌ ప్రెసిడెంట్ గా మాదాల రవి.. పృధ్వీరాజ్ పోటీకి దిగుతున్నారు. ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా బాబుమోహన్‌... ట్రెజరర్ గా శివబాలాజీ.. జాయింట్‌ సెక్రటరీగా కరాటే కల్యాణి.. గౌతమ్ రాజు పోటీ చేస్తున్నారు. ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లుగా 18 మంది పోటీ చేయనున్నారు. హీరోయిన్‌ అర్చన.. అశోక్ కుమార్‌.. గీతాసింగ్‌.. హరినాధ్ బాబు.. జయంతి.. మలక్ పేట శైలజ.. మాణిక్‌ పోటీకి దిగుతున్నారు. నటి పూజిత.. రాజేశ్వరిరెడ్డి.. హీరోయిన్‌ రేఖ.. సంపూర్ణేష్ బాబు.. శశాంక్‌.. శివనారాయణ.. శ్రీలక్ష్మి ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లుగా పోటీ చేస్తున్నారు. అక్టోబరు 10న `మా` ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.