Begin typing your search above and press return to search.
నన్ను ఫాలో అవ్వకండి ప్లీజ్ : బన్నీ
By: Tupaki Desk | 3 Feb 2020 7:10 AM GMTఅల్లు అర్జున్ సంక్రాంతి కి అల వైకుంఠపురంలో చిత్రంతో వచ్చి ఇండస్ట్రీ హిట్ ను దక్కించుకున్నాడు. అన్ని ఏరియాల్లో కూడా భారీ వసూళ్లను నమోదు చేసింది. కొన్ని ఏరియాల్లో అయితే ఏకంగా బాహుబలి 1 రికార్డును కూడా క్రాస్ చేసింది. ఎక్కువ శాతం ఏరియాల్లో నెం.3 గా ఉంటే కొన్ని ఏరియాల్లో నెం.2 స్థానంను దక్కించుకుంది. మొత్తానికి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ ను దక్కించుకుంది. చాలా కాలంకు ఇండస్ట్రీ హిట్ రావడంతో బన్నీ ఆనందానికి అవధులు లేవుకుండా ఉంది. అందుకే వరుసగా పార్టీలు ఇస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు.
తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న బన్నీ ఫ్యాన్స్ పట్ల తన ఆవేదన వ్యక్తం చేశాడు. సినిమా కోసం తాను బీడి తాగాను. కాని కొందరు టిక్ టాక్ వీడియోలు మరియు ఇతరత్ర కారణాలతో నన్ను ఫాలో అవుతూ బీడీ కాల్చుతున్నారు. మిమ్ములను కోరుకుంటున్నాను దయచేసి మీరు ఆ విషయంలో నన్ను ఫాలో అవ్వకండి. నేనేదో మాస్ అప్పీల్ కోసం పాటలో బీడీ కాల్చితే మీరు అలా చేయడం ఏమాత్రం సరికాదంటూ ఫ్యాన్స్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడు.
అల వైకుంఠపురంలోని సితరాల సిరపడు పాట ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ పాటలో బన్నీ బీడీ తాగుతూ రౌడీలను చావబాదేస్తూ ఉంటాడు. మామూలుగా సిగరెట్ ను చాలా స్టైల్ గా తాగుతారు. కాని బీడీని కూడా బన్నీ చాలా స్టైల్ గా తాగి తన పేరు స్టైలిష్ స్టార్ ను నిలబెట్టుకున్నాడంటూ అభిమానులు ప్రశంసిస్తూ ఆయన సీన్ ను ఇమిటేట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కొన్ని వందల మంది వేల మంది బీడీ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో బన్నీ నన్ను ఫాలో అవ్వకండి ప్లీజ్ అంటూ ఫ్యాన్స్ ను కోరాడు.