Begin typing your search above and press return to search.
రిషి కపూర్ మృతిపై సంతాపం ప్రకటించిన ప్రధాని మోదీ..!
By: Tupaki Desk | 30 April 2020 10:49 AM GMTకొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషి కపూర్ నేడు ఉదయం మరణించిన విషయం తెలిసిందే. క్యాన్సర్ ను జయించడానికి మృత్యువుతో పోరాడి ఓడిపోయారు. ఆయన మరణంపై కుటుంబ సభ్యులు ఓ లేఖ విడుదల చేస్తూ.. "లుకేమియాతో రెండు సంవత్సరాలపాటు పోరాడిన రిషి కపూర్ నేడు ఉదయం 8.45 గంటలకు కన్నుమూశారు. చివరి క్షణాల్లోనూ వైద్య సిబ్బందితో నవ్వుతూ నవ్విస్తూ గడిపారు. క్యాన్సర్ కు చికిత్స తీసుకుంటున్న సమయంలోనూ ఆయన అంతే సరదాగా ఉండేవారు. కుటుంబ సభ్యులతో గడపడం, ఫ్రెండ్స్‌తో ముచ్చటించడం, ఇష్టమైన ఫుడ్ తసుకోవడం.. ఇవన్నీ చూసి ఆయన్ని కలవడానికి వచ్చినవాళ్లందరూ ఆశ్చర్యపోయేవాళ్లు. ప్రపంచం నలుమూలల నుంచీ అభిమానులు కురిపించిన ప్రేమాభిమానాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మనమందరం ఆయన్ను కన్నీళ్లతో కాకుండా చిరునవ్వుతో గుర్తు చేసుకోవాలని ఆయన చివరి క్షణాల్లో కోరుకున్నారు. కాగా ప్రస్తుతం ప్రపంచం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. కాబట్టి ప్రభుత్వం విధించిన నిబంధనలను అందరూ తప్పక పాటించండి' అని పేర్కొన్నారు.
బాలీవుడ్ నటుడు రిషి కపూర్ మృతిపై ప్రధాని మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రిషిని ‘అద్భుతమైన టాలెంట్ ఉన్న శక్తిమంతుడిగా’ అభివర్ణించారు మోదీ. బహుముఖ ప్రజ్ఞాశాలి రిషితో తాను జరిపిన ఇంటరాక్షన్ లను ఆయన గుర్తు చేసుకున్నారు. సోషల్ మీడియాలో సైతం తాము ఒకరితో ఒకరు కాంటాక్ట్ చేసుకునేవారమని ఆయన పేర్కొన్నారు. మూవీలే తన ప్రాణమని చెప్పే రిషి… ఈ దేశ అభ్యున్నతికి తన వంతు కృషి చేశారన్నారు. ఆటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా రిషికపూర్ మృతి పట్ల ప్రగాఢ సంతాపం ప్రకటించారు. సినిమాల్లో అత్యద్భుతమైన పాత్రలు పోషించి.. రొమాంటిక్ హీరోగా పాపులర్ అయిన రిషి మృతితో ఈ దేశం అత్యంత అఫుడైన కొడుకును, చిత్ర సీమ ఒక ఆణిముత్యాన్ని కోల్పోయిందని ఆయన ట్వీట్ చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా రిషీ కపూర్ మృతిపై ట్విట్టర్ ద్వారా సంతాపం వ్యక్తం చేశారు. అమిత్ షా తన ట్వీట్లో రిషీ కపూర్ మృతి చాలా మృతి చాలా బాధాకరమైన ఘటన అని అన్నారు. రీషీ కపూర్ మరణం భారతీయ చలనచిత్ర పరిశ్రమకు కోలుకోలేని నష్టం అని చెప్పారు.
రిషీ కపూర్ తన అసాధారణమైన ప్రతిభతో ఎల్లప్పుడూ గుర్తుంచుకోబడతాడని చెప్పారు. అతని కుటుంబానికి సంతాపం ప్రకటించారు. వీరితో పాటు రాహుల్ గాంధీ.. శశిథరూర్ వంటి వారు సోషల్ మీడియా ద్వారా రిషీ కపూర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.