Begin typing your search above and press return to search.
లాక్ డౌన్ తర్వాత మొదటి చిత్రం `పిఎం నరేంద్ర మోడీ`
By: Tupaki Desk | 10 Oct 2020 3:30 PM GMTవివేక్ ఒబెరాయ్ నటించిన `పిఎం నరేంద్ర మోడీ` అక్టోబర్ 15 న థియేటర్లలోకి వచ్చే `మొదటి చిత్రం` అవుతుంది. సినిమా హాళ్ళు మల్టీప్లెక్స్‌లపై COVID-19 ఆంక్షలు ఎత్తివేశాక తొలి రిలీజ్ ఏది? అన్నదానికి ఈ రూపంలో ఆన్సర్ దొరికింది.
సినీ విమర్శకుడు.. మూవీ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్ష్ సోషల్ మీడియాలో శనివారం థియేటర్లలో తిరిగి విడుదల చేస్తున్న సినిమా ఇదేనని అధికారికంగా ధృవీకరించారు. వచ్చే వారంలో మొదటి సినిమా అంటూ ఆయన వ్యాఖ్యను జోడించారు. థియేటర్ విడుదలను ప్రకటించే అధికారిక పోస్టర్ ఇదేనంటూ ట్వీట్ చేశారు.
ఒబెరాయ్ నటించిన ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ప్రస్తుతం అంతర్జాలంలో జోరుగా వైరల్ అవుతోంది. గతేడాది మే 24న తొలిసారిగా విడుదలైన ఈ చిత్రంలో ఒబెరాయ్ పిఎం మోడీ పేరుతో తొమ్మిది విభిన్న గెటప్పుల్లో కనిపించారు. నిజ జీవిత పాత్రను పోషించడం అతడికి ఇదే మొదటిది. ఈ చిత్రంలో బోమన్ ఇరానీ- మనోజ్ జోషి- ప్రశాంత్ నారాయణన్- బర్ఖా బిష్ట్- రాజేంద్ర గుప్తా- జరీనా వహాబ్ కూడా నటించారు. సందీప్ సింగ్- ఆనంద్ పండిట్ - సురేష్ ఒబెరాయ్ నిర్మించిన ఈ బయోపిక్ పిఎం మోడీ రాజకీయ ప్రయాణాన్ని ఆవిష్కరిస్తుంది.