Begin typing your search above and press return to search.
టాలీవుడ్ చరిత్ర చిరిగి పదేళ్లయింది
By: Tupaki Desk | 28 April 2016 1:30 PM GMTచరిత్ర సృష్టించడం.. చరిత్ర తిరగరాయడం.. అంటుంటాం. పోకిరి సినిమా విషయానికొస్తే చరిత్ర చిరిగిపోవడం అని మాట్లాడుకోవాలేమో. ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. పెద్దగా అంచనాల్లేకుండా మామూలుగా బాక్సాఫీస్ బరిలోకి అడుగుపెట్టి.. తెలుగు సినిమాల్లో కనీవినీ ఎరుగని రికార్డుల్ని నెలకొల్పిందా సినిమా. అప్పుడు బద్దలైన రికార్డుల్ని మళ్లీ ఇంకో సినిమా బద్దలు కొట్టడం అసాధ్యమని అప్పుడే తేలిపోయింది. ఆ స్థాయిలో ప్రభంజనం సృష్టించిందా సినిమా. ‘పోకిరి’ సంచలనాలు మొదలై సరిగ్గా ఈ రోజుకు పదేళ్లు పూర్తయింది. 2006 ఏప్రిల్ 28న ‘పోకిరి’ సునామీ థియేటర్లను తాకింది.
ఇప్పట్లా కలెక్షన్ల లెక్కల్లో సినిమా విజయాన్ని కొలిచేవారు కాదు దశాబ్దం కిందట. అప్పటికి 50 రోజుల సెంటర్లు.. 100 డేస్ సెంటర్లే కొలమానం. 2003లో ఠాగూర్ సినిమా 253 థియేటర్లలో 50 రోజులు.. 191 సెంటర్లలో 100 రోజులు ఆడి తెలుగు చలనచిత్ర రికార్డుల్ని బద్దలుకొట్టింది. ఆ రికార్డుల్ని బద్దలు కొట్టడం ఇంకే సినిమాకూ సాధ్యం కాదని.. అవి ఎప్పటికీ నిలిచిపోతాయని అంతా అనుకున్నారు. ఐతే ఓ తమిళ రీమేక్ సినిమా పేరిట ఈ రికార్డులుండటం సగటు తెలుగు అభిమానికి కొంత అసంతృప్తి కూడా ఉండేది. ఇలాంటి సమయంలో ‘పోకిరి’ ఆ రికార్డుల్ని తిరగరాసింది.
299 సెంటర్లలో 50 రోజులు.. 200 సెంటర్లలో 100 రోజులు ఆడి ప్రభంజనం సృష్టించిందీ సినిమా. ఈ రెండింటి వరకే కాదు.. 63 సెంటర్లలో 175 రోజులు ఆడటం కూడా కనీ వినీ ఎరుగని రికార్డే. తెలుగు సినిమాల్లో ఇలా 50-100-175 రోజుల సెంటర్ల లెక్కల్లో సినిమా విజయాన్ని కొలవడం ‘పోకిరి’తోనే ముగిసిపోయింది. ఆ తర్వాత కలెక్షన్ల లెక్కలే ప్రామాణికమయ్యాయి. ‘మగధీర’ దగ్గర్నుంచి ఈ సెంటర్ల లెక్కలకు తెరపడింది. కలెక్షన్లే ప్రామాణికమయ్యాయి. దీంతో పోకిరి రికార్డులు చెక్కుచెదరకుండా నిలిచిపోయాయి.