Begin typing your search above and press return to search.

అజ్జాతవాసి కోసం బుజ్జి పోలాండ్ వాసి

By:  Tupaki Desk   |   3 Jan 2018 2:30 PM GMT
అజ్జాతవాసి కోసం బుజ్జి పోలాండ్ వాసి
X
తెలుగు పాటలను పూర్తి స్పష్టంగా.. అన్ని పదాలు కరెక్టుగా పలుకుతూ పాడడం.. ఈకాలం తెలుగు జనాలకే కాసింత కష్టమైపోతోంది. అందుకే రైటర్స్ కూడా పాటలలో ఇంగ్లీష్ పదాలను చొప్పించి రాసేస్తున్నారు. అయితే.. మన భాష తెలియని ఓ కుర్రాడు మాత్రం తెలుగు పాటలు తెగ పాడేస్తూ ఆశ్చర్య పరుస్తున్నాడు.

జిబిగ్స్ బుజ్జి అనే పోలండ్ కు చెందిన టీనేజ్ కుర్రాడు.. ఇప్పటికే నెటిజన్లకు బాగానే తెలుసు. హలో మూవీలో మెరిసే మెరిసే పాటను ఎంతో హృద్యంగా పాడి అలరించాడు. అచ్చ తెలుగు పదాలకు అర్ధం తెలియకపోయినా.. మన పాటలకు ఫిదా అయిపోయిన ఈ పోలండ్ బుజ్జి.. స్పష్టంగా పాడేస్తున్నాడు. ఇప్పుడీ కుర్రాడు ఏకంగా పవన్ కళ్యాణ్ కే న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చేయడం విశేషం. పవన్ కళ్యాణ్ మూవీ అజ్ఞాతవాసి నుంచి న్యూఇయర్ గిఫ్ట్ గా వచ్చిన కొడకా కోటేశ్వరరావా పాటను విడుదల చేయగా.. ఇది ట్రెండింగ్ అయిన సంగతి తెలిసిందే.

ఇప్పుడీ పాటనే ఫుల్ ఎనర్జిటిక్ గా పాడేశాడు పోలండ్ బుజ్జి. పాట స్టార్టింగ్ లో' హేయ్ పవర్ స్టార్.. ఎలక్ట్రిఫయింగ్ పాటను పాడావు.. కొడకా కోటేశ్వరరావు సూప్.. నీకు 2018కి నా గిఫ్ట్ ఇది ' అంటూ పాట ప్రారంభించిన బుజ్జి.. పాట చివర్లో 'ఒరే నీచ నికృష్ణ కోటేశ్వరరావా.. నీ దరిద్రాన్ని చెప్పేందుకు నా దగ్గర డైలాగ్స్ లేవురా' అంటూ తన పోలండ్ స్లాంగ్ తెలుగులో ఇచ్చిన ఫినిషింగ్ టచ్ అయితే అదిరిపోయింది. మన పాటలపై ఈ కుర్రాడి ప్రేమ భలేగుంది కదూ.