Begin typing your search above and press return to search.
జూనియర్ ఫంక్షన్లో పోలీసుల అత్యుత్సాహం
By: Tupaki Desk | 28 Dec 2015 3:57 AM GMTభారీ అంచనాలతో తెర కెక్కుతున్న ‘‘నాన్నకు ప్రేమతో..’’ సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ లో ఆదివారం జరగటం తెలిసిందే. పెద్ద పెద్ద కార్యక్రమాలు జరిగినప్పుడు భారీగా పోలీసు బందోబస్తు మామూలే. ఓపక్క ఫ్రెండ్లీ పోలిసింగ్ గురించి తెలంగాణ ప్రభుత్వం ఎంత చెబుతున్నా,. పోలీసుల వైఖరిని మాత్రం అందుకు భిన్నంగా ఉందన్న విమర్శ వినిపిస్తోంది. తాజాగా నాన్నకు ప్రేమతో ఆడియో లాంచ్ సందర్భంగా అనవసరమైన అత్యుత్సాహాన్ని పోలీసులు ప్రదర్శించారన్న అపవాదును పోలీసులు మూటగట్టుకున్నారు.
ఆడియో ఫంక్షన్ ను కవర్ చేయటానికి వెళ్లిన పలువురు మీడియా ప్రతినిధుల్ని కార్యక్రమానికి అనుమతించకపోవటం.. అదేమంటే.. అత్యుత్సాహంతో దురుసుగా ప్రదర్శించటం విమర్శలకు గురైంది. మీడియాతో పాటు.. ఎన్టీఆర్ అభిమానుల విషయంలోనూ పోలీసులు వ్యవహరించిన ధోరణిపై అగ్రహం వ్యక్తమవుతోంది. పెద్ద పెద్ద కార్యక్రమాలు ఏం జరుగుతున్నా పోలీసుల తీరుతో పలువురు ఇబ్బంది పడక తప్పటం లేదన్న మాట ఈ మధ్య కాలంలో తరచూ వినిపిస్తోంది. అదే సమయంలో.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా నిర్వహించిన అయుత చండీయాగంలో పోలీసుల తీరుపై ప్రశంసల వర్షం కురిసింది. ముఖ్యమంత్రి సొంత కార్యక్రమానికి ప్రదర్శించినంత కమిట్ మెంట్ మిగిలిన విషయాల్లోనూ ప్రదర్శిస్తే ఎంత బాగుండన్న వ్యాఖ్యను పలువురు వ్యక్తం చేస్తున్నారు.