Begin typing your search above and press return to search.

ర‌చ‌యిత అనంత శ్రీ‌రామ్ పై పోలీస్ కేసు

By:  Tupaki Desk   |   8 Aug 2021 7:45 AM GMT
ర‌చ‌యిత అనంత శ్రీ‌రామ్ పై పోలీస్ కేసు
X
మ‌నోభావాలు గాయ‌ప‌డుతున్న‌ సీజ‌న్ ఇది. సోష‌ల్ మీడియా పుణ్యమా అని ప్ర‌తిదీ డిబేట‌బుల్ గా మార‌డంతో అది కాస్తా ర‌చ‌యిత‌ల‌కు కూడా చిక్కులు తెచ్చి పెడుతోంది. ప్ర‌జ‌లు ప్ర‌తిదీ సునిశితంగా ప‌రిశీలిస్తున్నారు. ఎవ‌రికి వారు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇప్పుడు పాట‌ల ర‌చ‌యిత అనంత శ్రీ‌రామ్ కి కూడా ఇది చిక్కులు తెచ్చి పెట్టింది. నాగ‌శౌర్య న‌టించిన `వ‌రుడు కావలెను` సినిమా కోసం అత‌డు రాసిన `దిగు దిగు నాగ` సాంగ్ వివాదాస్ప‌ద‌మైంది. ఈ పాట‌లో అత‌డు రాసిన కొన్ని ప‌దాలు హిందూ మ‌నోభావాల్ని గాయ‌ప‌రిచాయంటూ ఫిర్యాదుదారు పేర్కొన్నారు. చిల్లకూరు(నెల్లూరు) పోలీస్ స్టేషన్ లో పాటల రచయిత అనంత్ శ్రీరామ్ పై బిజెపి మహిళా మోర్చా నాయకురాలు బిందు రెడ్డి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దాఖలు చేశారు.

దిగు దిగు నాగ పాటలో అభ్యంత‌ర‌క‌ర విష‌యాలున్నాయి. ఇందులో క‌థానాయిక‌ రీతు వర్మ గ్లాం షోతో ఐటమ్ నంబర్ ని త‌ల‌పిస్తున్న విధానం మ‌నోభావాల‌ను కించ‌ప‌రిచింది. ఈ పాటలో ప్రధాన పదబంధం ప్రముఖ భక్తి జానపద పాట నుండి తీసుకున్నారు. ఈ పాట నాగ దేవతను కించపరిచేలా ఉందని బిందురెడ్డి ఆరోపించారు. దానిని సినిమా నుంచి తొల‌గించాలని ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌ను డిమాండ్ చేసారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని కూడా ఫిర్యాదుదారు పేర్కొన్నారు.

ర‌చ‌యిత‌పైనా సితార ఎంటర్ టైన్ మెంట్స్ పైనా చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను అభ్యర్థించారు. అనంత శ్రీరామ్ కానీ నిర్మాతలు కానీ ఇంకా ఈ ఫిర్యాదుపై స్పందించలేదు. శ్రేయాఘోష‌ల్ ఈ పాట‌ను ఆల‌పించ‌గా థ‌మ‌న్ సంగీతం అందించారు. లక్ష్మీ సౌజన్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.