Begin typing your search above and press return to search.
టికెట్ రేట్ల వ్యవహారం: థియేటర్లపై పోలీసుల తనిఖీలు..!
By: Tupaki Desk | 21 Dec 2021 1:30 PM GMTఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్ల వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. టికెట్ రేట్లు తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపై ప్రస్తుతం హైకోర్టులో విచారణ జరుగుతోంది. జీవో నెం. 35 ని రద్దు చేస్తూ గతవారం సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్ కి అప్పీల్ చేసిన సంగతి తెలిసిందే.
విచారణలో భాగంగా సినిమా టికెట్ రేట్ల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అయితే జీవో నెం.35 ను కోర్టు రద్దు చేసినా.. థియేటర్ యజమానులు టికెట్ రేట్లు పెంచుకోవాలంటే జాయింట్ కలెక్టర్ల అనుమతి తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది.
ఇక జీవో నెం.35 రద్దు రాష్ట్రంలోని అన్ని థియేటర్‌లకు వర్తిస్తుందని ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ హైకోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలోనే థియేటర్లలో టికెట్ల ధరలపై పోలీసులు వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా మంగళవారం విజయవాడలోని థియేటర్లలో తనిఖీ చేప్టటారు.
థియేటర్లలో టికెట్ ధరలు ఎలా ఉన్నాయి? ఏయే థియేటర్లు అధిక ధరలకు సినిమా టికెట్స్ విక్రయిస్తున్నారనే విషయాలను పోలీసులు తెలుసుకుంటున్నారు. ఇప్పటికే నగరంలోని దాదాపు అన్ని థియేటర్లలో పోలీసుల తనిఖీలు పూర్తయినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించనున్నారని సమాచారం.
కాగా, ప్రజలకు తక్కువ ధరకు వినోదాన్ని అందించాలన్న ఉద్దేశ్యంతోనే ఈ జీవో తీసుకొచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. సింగిల్ జడ్జి ఉత్తర్వుల వల్ల టికెట్ రేట్లు ఇష్టానుసారంగా పెంచుకునే అవకాశం ఉంటుందని సోమవారం హైకోర్టులో ఏజీ వాదనలు వినిపించారు. టికెట్ ధరల నియంత్రణపై కమిటీ వివరాలను అడిషనల్ అఫిడవిట్ లో దాఖలు చేయడానికి సమయం ఇచ్చిన న్యాయస్థానం.. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.
ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే సినిమా టికెట్ విక్రయాలు కోసం ఆన్ లైన్ టికెటింగ్ సిస్టమ్ ని తీసుకొస్తున్నట్లు తెలిపిన ప్రభుత్వం.. టికెట్ల అమ్మకాల బాధ్యతను APFCకి అప్పగించింది.
వీలైనంత త్వరగా ఆన్ లైన్ సినిమా టికెటింగ్ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకురావడానికి ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇకపోతే ఆల్ లైన్ టికెటింగ్ విధానాన్ని స్వాగతిస్తున్న సినీ ప్రముఖులు.. టికెట్ ధరలు తగ్గించడాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నారు. మరి చివరకు ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.