Begin typing your search above and press return to search.

అభిమాని చేసిన పనికి హీరోపై కేసు

By:  Tupaki Desk   |   13 May 2017 9:18 AM GMT
అభిమాని చేసిన పనికి హీరోపై కేసు
X
ఎవరో జ్వాలను రగిలించారు.. వేరెవరో దానికి బలి అయినారు.. అంటూ ఓ పాట ఉంటుంది. అప్పుడప్పుడు కొందరు ఇలాగే ఎవరో చేసిన పనికి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఆ మధ్య టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని చేతిలో చాలా బ్రాండ్లు ఉన్నాయనడానికి సూచికగా ఓ మ్యాగజైన్ అతడిని దేవుడి తరహాలో మార్చి చేతిలో ఓ బ్రాండెడ్ షూ పెట్టడంపై దుమారం రేగడం.. ఈ వివాదానికి సంబంధించి ధోనిపై కేసు కూడా నమోదవడం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు తమిళ హీరో విజయ్ కూడా ఇలాంటి అనవసర వివాదంతో ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తింది. ఓ అభిమాని అత్యుత్సాహం విజయ్ తలకు చుట్టుకుంది.

సోషల్ మీడియా యాక్టివ్ అయ్యాక తమ ఫొటో షాప్ ద్వారా తమ అభిమాన హీరోల్ని రకరకాల వేషాల్లో తీర్చిదిద్దడం అభిమానులకు అలవాటైంది. ఇలాగే ఓ అభిమాని విజయ్ చేతికి త్రిశూలం పెట్టి ఒక ఇమేజ్ రెడీ చేశాడు. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫొటో వైరల్ అయింది. ఐతే త్రిశూలాన్ని పట్టుకున్న విజయ్ కాలికి షూలు వేసుకుని ఉండటంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. హిందూ మక్కల్‌ మున్నని పార్టీ దీనిపై మండిపడింది. షూలు ధరించి త్రిశూలం చేతపట్టడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని పేర్కొంటూ విజయ్‌ మీద పోలీసు కేసు పెట్టింది. ఐతే ఈ ఫొటోతో విజయ్ కు సంబంధం లేదని ఆ పార్టీకి తెలుసో లేదో మరి. ఈ వివాదంపై విజయ్ ఏమని స్పందిస్తాడో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/