Begin typing your search above and press return to search.

`ఆచార్య‌`కు శానక‌ష్టం తెచ్చిన మందాకిని

By:  Tupaki Desk   |   6 Jan 2022 6:39 AM GMT
`ఆచార్య‌`కు శానక‌ష్టం తెచ్చిన మందాకిని
X
మెగా పవ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌లిసి న‌టించిన ప్ర‌తిష్టాత్మ‌క మ‌ల్టీస్టార‌ర్ మూవీ `RRR`. రాజ‌మౌళి క్రేజీ ప్రాజెక్ట్ గా అత్యంత భారీ బ‌డ్జెట్ తో రూపొందించిన ఈ మూవీ జ‌న‌వ‌రి 7న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లకు సిద్ధం కావ‌డం.. ఆ త‌రువాత దేశ వ్యాప్తంగా మారుతున్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో రిలీజ్ వాయిదా కావ‌డం తెలిసిందే.

అయితే ఈ మూవీలో అల్లూరి సీతారామ‌రాజు, కొమురం భీం పాత్ర‌ల‌ని వ‌క్రీక‌రించార‌ని, వారిని ఆరాధించే వారిని కించ‌ప‌రిచారంటూ ఆంధ్ర ప్ర‌దేశ్ లోని ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా స‌త్య‌వ‌ర‌పు ఉండ్రాజ‌వ‌రానికి చెందిన అల్లూరి సౌమ్య తెలంగాణ హై కోర్టులో ప్ర‌త్యేక పిల్ వేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఈ సంఘ‌ట‌న ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతున్న స‌మ‌యంలోనే మ‌రో భారీ సినిమాపై మ‌రో వ‌ర్గం పోలీస్ కంప్లైంట్ ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వివ‌రాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న తాజా చిత్రం `ఆచార్య‌`. కొర‌టాల శివ అత్యంత భారీ స్థాయిలో తెర‌కెక్కిస్తున్న ఈ మూవీలో రామ్ చ‌ర‌ణ్ కూడా కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న విష‌యం తెలిసిందే. సిద్దాగా ఆయ‌న పాత్ర సినిమాకు ప్ర‌ధాన బ‌ల‌మ‌ని చెబుతున్నారు.

ఫిబ్ర‌వ‌రి 4న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న ఈ మూవీపై తాజాగా పోలీస్ కంప్లైంట్ న‌మోదు కావ‌డం హాట్ టాపిక్ గా మారింది. కొంత మంది ఆర్ ఎంపీ డాక్ట‌ర్లు `ఆచార్య‌` సినిమాపై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ వివాదానికి కార‌ణం తాజాగా విడుద‌ల చేసిన `సానా క‌ష్టం..` సాంగ్ అని తెలిసింది. మెగాస్టార్ చిరంజీవి, రెజీనా పై చిత్రీక‌రించిన ఈ పాట‌కు భాస్క‌భ‌ట్ల సాహిత్యం అందించారు. గీతా మాధురి, రేవంత్ ఆల‌పించారు.

రీసెంట్ గా విడుద‌ల చేసిన ఈ లిరిక‌ల్ వీడియో నెట్టింట వైర‌ల్ గా మారింది. మ‌ణిశ‌ర్మ అందించిన బాణీల‌తో ఈ పాట‌ సూప‌ర్ హిట్ అయింది. అయితే ఈ పాట‌లో `ఏదేదో నిమురొచ్చ‌ని కుర్రాళ్లు ఆర్ ఎంపీలు అయిపోతున్నారే..` అనే ప‌దాలున్నాయి. ఈ ప‌దాలు ఆర్ ఎంపీల‌ని కించ‌ప‌రిచేలా వున్నాయ‌ని.

అమ్మాయిల ట‌చ్చింగ్ కోస‌మే చాలా మంది ఆర్ ఎంపీలుగా మారుతున్న‌ట్టుగా ఇందులో చిత్రీక‌రించార‌ని, మమ్మ‌ల్ని అవ‌మానించార‌ని తెలంగాణ‌లోని జ‌న‌గామకు చెందిన ఆర్ ఎంపీ డాక్ట‌ర్ల అసోసియేష‌న్‌ మండిప‌డుతూ `ఆచార్య‌` పై పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

ర‌చ‌యిత భాస్క‌రభ‌ట్ల‌తో పాటు ద‌ర్శ‌కుడిని కూడా ఈ విష‌యంలో మంద‌లించాల‌ని వారు ఈ సంద‌ర్భంగా డిమాండ్ చేయ‌డం గ‌మ‌నార్హం. దీనిపై ద‌ర్శ‌కుడు, చిత్ర బృందం ఇంత వ‌ర‌కు స్పందించ‌లేదు. దీనిపై `ఆచార్య‌` టీమ్ ఏమ‌ని స్పందించ‌బోతోంది? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. అయితే ఈ కేసు గురించి తెలుసుకున్న వాళ్లంతా `ఆచార్య‌`కు శాన క‌ష్టం తెచ్చావే మందాకిని.. అంటూ స‌ర‌దాగా పాడుకుంటున్నారు.