Begin typing your search above and press return to search.

రాళ్ళేసిన కమెడియన్ కు చెమట్లు పట్టేలా..

By:  Tupaki Desk   |   14 Sep 2016 5:25 AM GMT
రాళ్ళేసిన కమెడియన్ కు చెమట్లు పట్టేలా..
X
ఇండియాలో చాలామంది కమెడియన్స్ ఉన్నారు కానీ.. కేవలం కామెడీ షో తోనే దేశవ్యాప్తంగా స్టార్ అయిపోయాడు కపిల్ శర్మ. ఒక్కో ఎపిసోడ్ కి 60 లక్షలు చొప్పున ఛార్జ్ చేసే ఈ కమెడియన్.. ఈ మధ్య ప్రధాని మోడీని ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ పెట్టాడు. ఏటా 5 కోట్లు ట్యాక్స్ కట్టే తాను.. ముంబైలో ఆఫీస్ కట్టుకోవడానికి 5 లక్షలు లంచం ఇవ్వాలా అని నిలదీశాడు. దీనికి మహరాష్ట్ర సీఎం స్పందించి.. లంచం అడిగిన వాళ్ల డీటైల్స్ ఇమ్మన్నారు కానీ.. ఇతగాడు సైలెంట్ అయిపోయాడు.

కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీని ఓసారి కెలికితే.. ఎలా ఉంటుందో ఇప్పుడు కపిల్ శర్మకు చూపించేస్తున్నారు అధికారులు. ఫారెస్ట్ అఫీషియల్స్.. బాంబే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు.. పోలీసులు ఇతడి ఇంటిని ఆఫీస్ ను పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించేస్తున్నారు. ఇప్పటికే ఇంటి విషయంలో అనుమతులు ఉల్లంఘించాడని తేలడంతో కేసులు కూడా పెట్టేశారు. అనధికార కట్టడాలు అంటూ బీఎంసీ అధికారులు కంప్లెయింట్ చేయడంతో.. పోలీసులు కేసు నమోదు చేశారు కూడా. ఫారెస్ట్ అధికారులు కూడా ఇప్పటికే పలు కేసులు నమోదు చేసేశారు.

ఇంతకీ ఇప్పటివరకూ తనను లంచం అడిగిన అధికారులు ఎవరో చెప్పలేదు కపిల్ శర్మ. ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలు.. ఎవరో ప్రేరేపిస్తేనో.. ఇంకోళ్లెవరో చెబితేనో గవర్నమెంటుపై రాళ్లేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడానికి. చెమట్లు పట్టించేస్తున్నారు.