Begin typing your search above and press return to search.
హీరోయిన్ బ్యాంక్ అకౌంట్స్ నిలిపేశారు!
By: Tupaki Desk | 30 July 2016 2:49 PM GMTఏమాటకామాట చెప్పుకోవాలంటే.. బాలీవుడ్ కు డ్రగ్స్ కు కాస్త అవినాభావ సంబందం ఉందనే అనుకోవాలి! ఆమాటకొస్తే బాలీవుడ్ అనే కాదు ఇప్పుడు అన్ని ఇండస్ట్రీల్లోనూ డ్రగ్స్ కు స్థానం దొరుకుతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఒక బాలీవుడ్ హీరోయిన్ కు సంబందించిన బ్యాంక్ అకౌంట్స్ ను పోలీసులు స్థంభింపచేశారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారురు. ఆ హీరోయిన్ పేరు మమతా కులకర్ణి!
బాలీవుడ్ హీరోయిన్ మమతా కులకర్ణి అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ లో నిందితురాలు అని ఆమె బ్యాంక్ ఖాతాలను మహారాష్ట్ర పోలీసులు తాజాగా స్తంభింపజేశారు. గుజరాత్ - ముంబై ఇతర ప్రాంతాల్లోని మమత పేరున ఉన్న సుమారు 8 బ్యాంక్ ఖాతాలను ఆపివేసినట్టు థానె పోలీసులు తెలియచేశారు. ఈ 8 ఎకౌంట్లలో మొత్తం 90 లక్షల రూపాయలకుపైగా నగదు ఉందట. మలాడ్ లోని ఓ ప్రైవేట్ బ్యాంక్ ఖాతాలో 67 లక్షలు ఉండగా, ఇతర బ్యాంకుల్లో మరో 26 లక్షల రూపాయల నగదు నిల్వ ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు.
ఈ విషయంలో మమత అక్కతో పాటు పలువురిని ప్రశ్నిస్తున్న పోలీసులు.. డ్రగ్స్ రాకెట్ విచారణలో భాగంగానే బ్యాంక్ అకౌంట్స్ స్థంభింపచేశామని చెబుతున్నారు. ఈ డ్రగ్స్ రాకెట్ కేసులో మమత కులకర్నితో పాటు ఆమెతో సహజీవనం చేస్తున్నట్లు భావిస్తున్న విక్కీ గోస్వామినితో సహా మరో 17మంది నిందితులుగా ఉన్నారు. ప్రస్తుతం నైరోబీలో ఉంటున్న మమత... తనను డ్రగ్స్ కేసులో ఇరికిస్తే ఉచితంగానే మంచి ప్రచారం లభిస్తుందని పోలీసులు భావించారని, అందువల్లే తన పేరును డ్రగ్స్ కేసులో చేర్చారని ఆరోపణలు చేస్తోంది.