Begin typing your search above and press return to search.

ఆ ముగ్గురి వల్లే శ్రావణి చనిపోయింది.. త్వరలోనే ఆర్ఎక్స్ 100 నిర్మాత అశోక్ రెడ్డి అరెస్ట్

By:  Tupaki Desk   |   14 Sep 2020 5:00 PM GMT
ఆ ముగ్గురి వల్లే శ్రావణి చనిపోయింది.. త్వరలోనే ఆర్ఎక్స్ 100 నిర్మాత అశోక్ రెడ్డి అరెస్ట్
X
టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ముగ్గురిని నిందితులుగా పోలీసులు ప్రకటించారు. సాయికృష్ణారెడ్డి, దేవరాజ్ రెడ్డిలతోపాటు సినీ నిర్మాత అశోక్ రెడ్డిలను నిందితులుగా పోలీసులు తెలిపారు. ఇప్పటికే సాయికృష్ణ, దేవరాజ్ లను అరెస్ట్ చేశామని.. అశోక్ రెడ్డి పరారీలో ఉన్నాడని.. అతడిని అరెస్ట్ చేస్తామని జాయింట్ సీపీ శ్రీనివాస్ మీడియాతో తెలిపారు.

శ్రావణి ఆత్మహత్య కేసులో ఏ1గా సాయికృష్ణారెడ్డి, ఏ2గా నిర్మాత అశోక్ రెడ్డి, ఏ3గా దేవరాజు రెడ్డిని చేర్చినట్టుగా జాయింట్ సీపీ శ్రీనివాస్ తెలిపారు.

దేవరాజురెడ్డితో శ్రావణికి సాన్నిహిత్యం ఏర్పడిందని.. అతడిని కలువవద్దని కుటుంబ సభ్యులు, సాయికృష్ణా రెడ్డి శ్రావణిపై తీవ్ర ఒత్తిడి తెచ్చారని సీపీ తెలిపారు. అదే మరణానికి కారణమైందన్నారు.

2015లో సాయికృష్ణారెడ్డితో శ్రావణికి పరిచయం ఏర్పడిందని.. మూడేళ్ల పాటు స్నేహం చేశారని సీపీ తెలిపారు. 2017లో శ్రావణికి నిర్మాత అశోక్ రెడ్డితో పరిచయం ఏర్పడిందని తెలిపారు. 2019 ఆగస్టులో శ్రావణికి దేవరాజురెడ్డితో పరిచయం ఏర్పడిందన్నారు.

దేవరాజురెడ్డితో స్నేహంగా ఉండడం సాయికృష్ణకు నచ్చలేదని.. అతడితో శ్రావణి కుటుంబ సభ్యులు ఆమెను తీవ్రంగా ఒత్తిడి తెచ్చారన్నారు.

ఇక నిర్మాత అశోక్ రెడ్డి కూడా శ్రావణికి అవకాశాలు ఇప్పించి పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడని.. అతడు కూడా శ్రావణిని మోసం చేశాడని భావిస్తున్నట్టు జాయింట్ సీపీ తెలిపారు.

ఆత్మహత్య చేసుకునే ముందు దేవరాజుతో శ్రావణి చాలా సేపు మాట్లాడిందని సీపీ తెలిపారు. దీన్ని బట్టి దేవరాజుతో శ్రావణి ప్రేమకు కుటుంబం, సాయికృష్ణ ఒప్పుకోవడం లేదని తెలుస్తోందన్నారు. దేవరాజు కూడా శ్రావణిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించలేదని తెలుస్తోందని సీపీ తెలిపారు. ఆ ఫోన్ కాల్ తర్వాతే శ్రావణి ఆత్మహత్య చేసుకుందన్నారు.

దేవరాజు, సాయికృష్ణ, అశోక్ రెడ్డిలు శ్రావణిని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చారని జాయింట్ సీపీ తెలిపారు.శ్రావణిని ఈ ముగ్గురు మానసికంగా.. శారీరకంగా హింసించారని తెలిపారు. అందుకే ముగ్గురిపై కేసులు పెట్టామని తెలిపారు. ప్రత్యక్షంగానూ.. పరోక్షంగానూ ఈ ముగ్గురే ఆమె మరణానికి కారణమయ్యారని వివరించారు. శ్రావణి కుటుంబ సభ్యులెవరినీ ఈ కేసులో నిందితులుగా చూడడం లేదన్నారు.