Begin typing your search above and press return to search.

కాజల్‌ ను కూడా లైన్‌ లో పెట్టిన పోలీసులు

By:  Tupaki Desk   |   3 March 2020 12:54 PM GMT
కాజల్‌ ను కూడా లైన్‌ లో పెట్టిన పోలీసులు
X
ఇండియన్‌ 2 యాక్సిడెంట్‌ అయ్యి రోజులు గడుస్తున్నా కూడా ఇంకా ఆ ప్రమాద దిగ్బ్రాంతి నుండి తమిళ సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు బయటకు రాలేక పోతున్నారు. ఇదే సమయంలో పోలీసులు యాక్సిడెంట్‌ కు సంబంధించిన విచారణ వేగవంతం చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్శకుడు శంకర్‌ మరియు హీరో కమల్‌ లకు సమన్లు జారి చేయడం జరిగింది. ఇప్పటికే వీరిద్దరు కూడా పోలీసుల ముందు హాజరు అయ్యి వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

మరో మారు కూడా వీరిద్దరిని ప్రశ్నించే అవకాశం ఉందట. ఇదే సమయంలో హీరోయిన్‌ కాజల్‌ ను కూడా విచారించేందుకు పోలీసులు రెడీ అయ్యారు. ప్రస్తుతం యాక్సిడెంట్‌ జరిగిన సమయంలో అక్కడ ఉన్న వారందరి లిస్ట్‌ ను తయారు చేసిన పోలీసులు అందులో కాజల్‌ ను కూడా చేర్చారు. కాజల్‌ అగర్వాల్‌ ను కూడా విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆమెకు సమన్లు కూడా జారీ అయినట్లుగా తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి.

కాజల్‌ మరియు కమల్‌ లు తృటిలో ఈ ప్రమాదం నుండి తప్పించుకున్న విషయం తెల్సిందే. శంకర్‌ స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. మృతి చెందిన వారి కుటుంబాలకు కమల్‌ మరియు నిర్మాణ సంస్థ ఇంకా పలువురు ఆర్థిక సాయంను ప్రకటించిన విషయం తెల్సిందే. మృతుల కుటుంబ సభ్యులు కేసు పెట్టకున్నా కూడా పోలీసులు ఈ కేసును స్పెషల్‌ ఇంట్రెస్ట్‌ తో ఇన్వెస్టిగేషన్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.