Begin typing your search above and press return to search.

హృతిక్-కంగన గొడవ.. కంక్లూజన్ ఇదే

By:  Tupaki Desk   |   17 Nov 2016 3:30 PM GMT
హృతిక్-కంగన గొడవ.. కంక్లూజన్ ఇదే
X
బాలీవుడ్లో ఈ ఏడాది హాట్ టాపిక్ గా మారిన అంశాల్లో హృతిక్ రోషన్-కంగనా రనౌత్ ల గొడవ ఒకటి. ముందు ఏదో సిల్లీ వ్యవహారంలాగా కనిపించింది కానీ.. ఓ దశలో వీరి గొడవ తీవ్ర స్థాయికి చేరింది. చివరికి ఇద్దరూ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లారు. పరస్పరం కేసులు పెట్టుకున్నారు. పోలీసులు కూడా ఓ దశలో వీరి కేసుల్ని తీవ్రంగా తీసుకున్నారు. దీంతో ఈ గొడవ ఇంకెంత దూరం వెళ్తుందో అని అందరూ సందేహించారు. ఐతే ఈ గొడవకు ఇంతటితో తెరపడినట్లే కనిపిస్తోంది. ఎందుకంటే కేసును ముందుకు తీసుకెళ్లే ఆధారాలేమీ పోలీసులకు లభించలేదు.

హృతిక్-కంగనా గొడవలో కీలకమైన విషయం... ఆమెకు హృతిక్ నుంచి మెయిల్స్ రావడం. హృతిక్ పేరుతో ఉన్న ఆ మెయిల్ ఐడీని పోలీసులకు ఇచ్చింది కంగనా. హృతిక్ అది నా మెయిల్ ఐడీ కాదు అన్నాడు. పోలీసుల విచారణలోనూ దాదాపుగా ఇదే విషయం తేలింది. అమెరికా నుంచి ఆపరేట్ చేస్తున్న మెయిల్ ఇదని వెల్లడైంది.

అంతకుమించి పోలీసులు వివరాలు సేకరించలేకపోయారు. అమెరికా సర్వర్ నుంచి వస్తున్న మెయిల్ కావడంతో పోలీసులు ఏమీ తేల్చలేకపోయారు. ఈ కేసుకు ఇంతటితో ముగింపు పలకాలని వాళ్లు నిర్ణయించారు. హృతిక్.. కంగనా కూడా ఈ గొడవకు ఇంతటితో ముగింపు పలకాలని భావిస్తున్నారు. పరస్పరం కేసుల్ని ఉపసంహరించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. హృతిక్ ను సిల్లీ ఎక్స్ అనడంతో మొదలైంది ఈ గొడవ. హృతిక్ తనను పెళ్లి కూడా చేసుకోవాలని అడిగినట్లుగా కంగనా ఆరోపించింది. ఐతే కంగనాకు అంత సీన్ లేదని అన్నాడు హృతిక్. ఇంకా మాటల దాడి తీవ్రమై పరిస్థితి అదుపు తప్పుతున్న టైంలో ఇద్దరూ సైలెంటయ్యారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/