Begin typing your search above and press return to search.
పూరీ ఫ్యామిలీకి పోలీస్ ప్రొటెక్షన్.. 'లైగర్' వివాదం ఎక్కడికి దారితీస్తుందో..!
By: Tupaki Desk | 27 Oct 2022 11:39 AM GMT'లైగర్' సినిమాకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల విషయంలో దర్శక నిర్మాత పూరీ జగన్నాథ్ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. డిస్టిబ్యూటర్ వరంగల్ శ్రీను మరియు ఫైనాన్సియర్ శోభన్ బాబులు తనను వేధిస్తున్నారని.. తనకు ప్రాణ హాని ఉందని ఫిర్యాదు చేశారు.
శ్రీను - శోభన్ లు తన కుటుంబంపై దాడి చేయడానికి ఇతరులను హింసకు ప్రేరేపిస్తున్నారని పూరి జగన్నాథ్ ఆరోపించారు. తాను ఇంట్లో లేని సమయంలో తన కుటుంబాన్ని శారీరకంగా మరియు మానసికంగా వేధిస్తున్నారని కంప్లెయింట్ లో పేర్కొన్నారు.
డిస్ట్రిబ్యూటర్స్ నుంచి తన ఫ్యామిలీకి ప్రాణ హాని ఉందని.. హైదరాబాద్ లో ఉన్న తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని పోలీసులకు పూరీ విజ్ఞప్తి చేశారు. పూరీ జగన్నాథ్ ఫిర్యాదును పరిశీలించిన జూబ్లీహిల్స్ పోలీసులు.. అతని కుటుంబానికి రక్షణగా కొంతమంది పోలీసులను ఇంటికి పంపినట్లు తెలుస్తోంది.
ఇటీవల పూరీ జగన్నాథ్ ఒక డిస్ట్రిబ్యూటర్ తో మాట్లాడిన ఆడియో టేప్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అందులో 'లైగర్' సినిమా వల్ల నష్టపోయిన బాధితులంతా ఈ నెల 27న తన ఇంటి ముందు ధర్నా చేయబోతున్నారని.. తన పరువు తీసేందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని పూరీ మాట్లాడారు.
డబ్బు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా.. పాపం వాళ్ళు కూడా నష్టపోయారులే అని ఇవ్వాలని అనుకున్నానని.. కానీ డబ్బు చెల్లిస్తానని చెప్పినా బెదిరింపులకు పాల్పడ్డారని పూరీ జగన్ ఆరోపించారు. ప్రస్తుతం ముంబైలో ఉన్న పూరీ.. డిస్ట్రిబ్యూటర్లు హైదరాబాద్ లోని తన ఇంటిపై దాడి చేసే అవకాశం ఉందన్న అనుమానంతో ముందస్తుగా భద్రత కల్పించాలని పోలీసులను కోరినట్లు తెలుస్తోంది.
కాగా, విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం 'లైగర్'. బాలీవుడ్ కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై పూరీ - చార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మించారు. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా.. బాక్సాఫీసు వద్ద దారుణ పరాజయాన్ని చవిచూసింది. దీంతో ఈ మూవీతో సంబంధం ఉన్న అన్ని పార్టీలు నష్టపోయాయి.
అయితే బయ్యర్లను ఆదుకోడానికి ముందుకు వచ్చిన పూరీ జగన్.. కొంతమేర నష్టపరిహారం చెల్లించడానికి అంగీకరించారు. అయితే డబ్బులు ఆలస్యం అవుతుండటంతో పూరీ ఇంటి ముందు ధర్నా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు పూరీ ఫిర్యాదుతో 'లైగర్' సెటిల్మెంట్ వ్యవహారం పోలీస్ స్టేషన్ కు చేరింది. మరి రానున్న రోజుల్లో ఈ సమస్య ఎటువైపు దారితీస్తుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.