Begin typing your search above and press return to search.
17 ఏళ్ల కెరీర్ లో తొలిసారి ఖాకీ డ్రెస్?
By: Tupaki Desk | 29 July 2020 4:45 AM GMTకెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో అద్భుతమైన ఆహార్యంతో నటించి మైమరిపించిన నటి త్రిష. రెండు దశాబ్ధాల కెరీర్ లో అత్యుత్తమ ప్రదర్శనలతో గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న అందాల కథానాయికగా పేరు తెచ్చుకుంది. పాత్ర ఏదైనా ప్రాణం పెట్టి నటించి తన స్థాయిని చాటుకుంది. అగ్ర కథానాయికలకు త్రిష ఠఫ్ కాంపిటీటర్ గా కొనసాగింది అంటే తనకు ఉన్న ట్యాలెంట్ వల్లనే. సౌత్ స్టార్ హీరోలందరికీ ఫేవరెట్ నాయిక అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి అంతటి వాడే త్రిషకు పిలిచి అవకాశం ఇచ్చారంటే అర్థం చేసుకోవాలి.
టాలీవుడ్ కోలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన త్రిష ఇరుగు పొరుగు భాషల్లోనూ రాణించింది. కెరీర్ పరంగా ప్రయోగాలు చేసేందుకు ఆసక్తిగా ఉంది. ఇటీవల నాయికా ప్రధాన పాత్రల్లో నటిస్తూనే గ్లామర్ పాత్రలకు ఓకే చెబుతోంది. చిరు సరసన ఆచార్యలో ఆఫర్ వచ్చినా రకరకాల కారణాలతో వదులుకుంది. మరోవైపు తమిళంలో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు త్రిష గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ప్రచారమవుతోంది.
ప్రస్తుతం త్రిష.. ప్రియమణి ప్రధాన పాత్రల్లో కుట్రపయిరిచి అనే తమిళ చిత్రం సెట్స్ పైకి వెళుతోంది. ఈ చిత్రానికి బాలా శిష్యుడు దర్శకత్వం వహించనున్నారు. యువనాయిక సురభి.. సుబ్బరాయలు ఇందులో ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో త్రిష పాత్ర గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. 17 ఏళ్ళ కెరీర్ లో తొలిసారిగా ఖాకీ డ్రెస్ లో కనిపించనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో త్రిష ఓ సీక్రెట్ ఏజెంట్ (డిటెక్టివ్) గా కనిపిస్తుందా? మఫ్టీలోని పోలీస్ గా కనిపిస్తుందా? అన్నది చూడాలి. విశాల్ సరసన ఇంతకుముందు `వేటాడు వెంటాడు` చిత్రంలో త్రిష ఆసక్తికర పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.