Begin typing your search above and press return to search.

స్టార్‌ హీరోకు పోలీస్‌ నోటీసులు

By:  Tupaki Desk   |   5 Nov 2018 5:58 AM GMT
స్టార్‌ హీరోకు పోలీస్‌ నోటీసులు
X
మీటూ ఉద్యమంలో భాగంగా శృతి హరిహరన్‌ చేసిన లైంగిక ఆరోపణల వేడి ఇప్పట్లో చల్లారేలా లేదు. స్టార్‌ హీరో అర్జున్‌ తనను లైంగికంగా వేదించాడు అంటూ మీడియా ముందుకు వచ్చి చెప్పిన శృతి హరిహరన్‌ పై అర్జున్‌ పరువు నష్టం దావా వేసిన విషయం తెల్సిందే. తనపై పరువు నష్టం దావా వేసినందుకు గాను శృతి హరిహరన్‌ ఏకంగా పోలీసులకు లైంగిక వేదింపు అంటూ అర్జున్‌ పై ఫిర్యాదు చేసింది. బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఎంక్వౌరీ మొదలు పెట్టారు. ఇప్పటికే ఎఫ్‌ ఐ ఆర్‌ నమోదు చేసిన పోలీసులు తాజాగా అర్జున్‌ ను ప్రశ్నించేందుకు సిద్దం అయ్యారు.

నిన్న(ఆదివారం) అర్జున్‌ కు పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. సోమవారం విచారణకు సహకరించాలని, శృతి హరిహరన్‌ మీపై ఇచ్చిన కేసు గురించి విచారించాలంటూ నోటీసులో పేర్కొనడం జరిగింది. సోడు అర్జున్‌ ను పోలీసులు ఈ కేసు విషయమై ప్రశ్నించేందుకు రెడీ అయిన నేపథ్యంలో మరోసారి కన్నడ సినిమా పరిశ్రమలో హై టెన్షన్‌ మొదలైంది. ఒక స్టార్‌ హీరోపై లైంగిక వేదింపు కేసు, అదీ కూడా విచారణ వరకు రావడంతో అంతా కూడా అవాక్కవుతున్నారు.

ఈ కేసులో అర్జున్‌ అరెస్ట్‌ అయ్యే అవకాశం కూడా ఉందంటూ కన్నడ సినీ వర్గాల్లో కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి శృతి హరిహరన్‌ చేసిన పని కారణంగా కన్నడ సినిమా పరిశ్రమ రెండు వర్గాలుగా చీలిపోయింది. అర్జున్‌ - శృతిల మద్య అంబరీష్‌ రాజీ కుదిర్చేందుకు ప్రయత్నాలు చేసినా అవి విఫలం అయిన సంగతి తెల్సిందే. నేడు విచారణ తర్వాత జరిగే పరిణామాలపై కన్నడ సినీ పరిశ్రమలో చర్చ జరుగుతోంది.