Begin typing your search above and press return to search.
ప్రెజర్ తో 150 ఫంక్షన్ ముగిసిపోయింది
By: Tupaki Desk | 7 Jan 2017 2:57 PM GMTమెగాస్టార్ చిరంజీవి కం బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150.. ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం ముందునుంచి బోలెడంత హంగామా నడిచింది. వేదిక మార్పు.. తేదీ మార్పుల తర్వాత.. చివరకు విజయవాడ-గుంటూరు మధ్యలో హాయ్ ల్యాండ్ లో ఈ ఫంక్షన్ ను నిర్వహించారు. అయితే.. ఈ వేడుకను.. ఎంతో ఎంతో ఆర్భాటంగా.. అతి ఎక్కువ సేపు ఈ కార్యక్రమం జరుగుతుందని అంతా అనుకున్నారు.
కానీ పట్టుమని రెండు గంటలు కూడా ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగలేదు. ఇందుకు ప్రధాన కారణం ఫ్యాన్స్ హంగామా. ఎంతమంది పోలీసులను సెక్యూరిటికీ ఉంచినా.. ఫ్యాన్స్ ను కంట్రోల్ చేయడం సాధ్యం కాలేదు. మెగాస్టార్ అభిమానులను నియంత్రించేందుకు ఏపీ పోలీసులు చాలా ఎక్కువగానే కష్టపడ్డారు. అయితే.. బ్యారికేడ్లు విరిగిపోవడం.. ఫ్యాన్స్ ముందుకు తోసుకువచ్చేయడం.. ముందు ఉన్నవారు చాలా ఇబ్బంది పడడంతో గబగబా ఫంక్షన్ ముగించేయాలని నిర్ణయించుకున్నారు.
అందుకే ఒక్క చిరంజీవి మినహా.. ఏ ఒక్క వ్యక్తి పట్టుమని రెండు నిమిషాలు కూడా మాట్లాడకుండానే స్పీచ్ ముగించేశారు. ఆఖరికి ఈ ఫంక్షన్ కు ముఖ్య అతిథి అయిన దాసరి నారాయణరావు కూడా 3 నిమిషాలు మాట్లాడలేదంటే.. మెగా వేడుకను ఎంత ఒత్తిడితో ముగించేశారో అర్ధం అవుతుంది. అభిమానులు డిసిప్లిన్ తో ఉంటే.. ఈ వేడుక మరింత సేపు ఉండేదని.. ఇంకా అలరించేదని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/