Begin typing your search above and press return to search.
మెక్సికన్ల అపార్ట్ మెంట్లే కిషన్ కు అడ్డా!
By: Tupaki Desk | 25 Jun 2018 1:29 PM GMTసాధారణంగా అమెరికా - సౌదీ - దుబాయ్...ఇలా విదేశాలలో ఉండే భారతీయులంతా దాదాపుగా ఒక చోట ఉండడానికి ఇష్టపడతారు. భారతీయులు అధికంగాగా ఉండే కాలనీలు - అపార్ట్ మెంట్లలో ఉండేందుకే ఎక్కువగా మొగ్గు చూపుతారు. దేశం కాని దేశంలో నివసిస్తున్నాం కాబట్టి.... తమ ప్రాంతం వారితో కలిసుండడం వల్ల ఏదైనా ఇబ్బంది కలిగినా....వారు అండగా నిలుస్తారనే ధీమా అందరిలోనూ ఉంటుంది. అయితే, చికాగో సెక్స్ రాకెట్ లో అరెస్టయిన కిషన్ మోదుగమూడి - చంద్రకళ దంపతులు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించినట్లు హెచ్ ఎస్ ఐ అధికారుల విచారణలో తేలింది. కిషన్ దంపతులు తెలుగు వారితో సహా కనీసం ఒక భారతీయ కుటుంబం కూడా లేని ప్రాంతంలో నివాసముంటున్నట్లు వారు తెలిపారు. ఎక్కువగా మెక్సికన్లు - చైనీయులు ఉండే ప్రాంతంలోని అపార్ట్ మెంట్లో వారు ఉంటున్నట్లు విచారణలో తేలింది. వారు నివాసముండే ప్లాట్ లో దాదాపుగా అందరూ మెక్సికన్లేనని పోలీసులు వెల్లడించారు. అయితే, వారెవ్వకరికీ అనుమానం రాకుండా ఇన్నాళ్లూ ఈ సెక్స్ రాకెట్ ను కిషన్ దంపతులు నడిపారని తెలుసుకొని పోలీసులు ఆశ్చర్యపోయారు.
గతంలో, వ్యభిచారం వంటి అసాంఘిక కార్యకలాపాలు చేయిస్తున్న వారు....జన సంచారం లేని ప్రదేశాల్లో ఉండేవారు. అయితే, ఇపుడు ట్రెండ్ మారింది. ప్రస్తుతం - నగరం నడిబొడ్డులోనే ఖరీదైన అపార్ట్ మెంట్లలోనే పట్టపగలు ఈ చీకటి వ్యాపారం కొనసాగడం శోచనీయం. కిషన్ దంపతులు కూడా అదే తరహాలో నగరంలోని రెండు అపార్టుమెంట్లలోని ఫ్లాట్స్ లో నిర్వహించేవారని యూఎస్ పోలీసులు విచారణలో కనుగొన్నారు. మెక్సికన్లు అధికంగా ఉన్న ఓ అపార్ట్ మెంట్లోని 1ఈ - 1యు యు అనే రెండు ఫ్లాట్స్ లో వీరు తమ దందా కొనసాగించారని పోలీసులు వెల్లడించారు. తమ గుట్టు రట్టు కాకూడదనే ఉద్దేశంతోనే వీరు భారతీయులు లేని ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. తమ ఇరుగుపొరుగు ప్లాట్లలోని వారితో కూడా కిషన్ దంపతులు మాట్లాడేవారు కాదట. ఆ మాటకొస్తే వీరిద్దరూ అరెస్ట్ అయిన సంగతి కూడా వారికి ఆ అపార్ట్ మెంట్ లో వాళ్లకు తెలీదట. చివరకు ఆ అపార్ట్ మెంట్ ఓనర్ చెబితే వారికి విషయం తెలిసిందట. కిషన్ పక్క ఫ్లాట్ లో ఉన్న కకిషన్ అనే మెక్సికన్...ఈ విషయం తెలిసి షాకయ్యానని చెప్పాడు. కిషన్ ఫ్లాట్ కు భారీ లగేజీతో అందమైన అమ్మాయిలు వచ్చిపోతుండేవారని, కానీ లోపల ఈ తంతు నడుస్తోందని అనుమానం రాలేదని తెలిపాడు. మరోవైపు, చికాగో సెక్స్ రాకెట్ నేపథ్యంలో అమెరికాలోని ఈవెంట్లలో పాల్గొనాల్సిన పలువురు టాలీవుడ్ హీరోయిన్లకు అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు వీసాలు నిరాకరిస్తోన్న విషయం విదితమే.