Begin typing your search above and press return to search.
తాగి డ్రైవ్ చేసింది.. ఆమెపై కేసు బుక్ చేసిన పోలీసులు
By: Tupaki Desk | 26 July 2021 5:30 PM GMTబిగ్ బాస్ ఫేమ్.. నటి యాషికా కారు యాక్సిడెంట్ కు గురయిన విషయం తెల్సిందే. అర్థ రాత్రి సమయంలో అతి వేగంగా కారు డ్రైవ్ చేస్తూ అదుపు చేయడంలో విఫలం అవ్వడం వల్ల డివైడర్ ను కారు ఢీ కొట్టి ఫల్టీలు కొట్టినట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆ సమయంలో కారు వేగం మరియు పరిస్థితిని చూస్తుంటే డ్రైవ్ చేస్తున్న వారు మద్యం తాగి ఉంటారంటూ ప్రాథమికంగా ఒక అంచనాకు పోలీసులు వచ్చారు. కారులో ఉన్న యాషికా స్నేహితురాలు అక్కడికి అక్కడే మృతి చెందగా యాషిక మాత్రం తీవ్ర గాయాలతో బయట పడింది.
గాయాల పాలయ్యి ప్రాణాపాయ స్థితి నుండి బయట పడ్డ యాషిక ను పోలీసులు వదిలేలా లేరు. ప్రత్యక్ష సాక్ష్యులు మరియు ఇతర విషయాలను పరిశీలించిన తర్వాత యాక్సిడెంట్ కు కారణం యాషిక అంటూ పోలీసులు నిర్థారణకు వచ్చారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలోనే ఆమెను విచారించేందుకు సిద్దం అవుతున్నట్లుగా తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
ప్రస్తుతం చికిత్స పొందుతున్న యాషిక కోలుకున్న తర్వాత ఆమెను కలిసి యాక్సిడెంట్ కేసు విచారణ జరుపుతామని పోలీసు అధికారులు చెబుతున్నారు. యాక్సిడెంట్ సమయంలో తాగి ఉండటంతో పాటు అతి స్పీడ్ తో డ్రైవ్ చేస్తున్న కారణంగా పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేస్తున్నట్లుగా పోలీసులు పేర్కొన్నారు. ఈ విషయమై యాషిక స్పందన ఏంటీ అనేది అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆమె తలకు ఎలాంటి గాయం కాకపోవడం వల్ల ప్రాణాపాయం లేదని.. కాని నడుము వద్ద ఆమెకు గాయాలు అయ్యి కొన్నాళ్ల పాటు లేవలేని పరిస్థితి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.