Begin typing your search above and press return to search.
50 సిమ్ కార్డ్స్ : సుశాంత్ కేసులో కొత్త ట్విస్ట్
By: Tupaki Desk | 22 July 2020 2:30 AM GMTబాలీవుడ్ హీరో సుశాంత్ ది ఆత్మహత్య అంటూ పోలీసులు ప్రాధమిక నిర్థారణకు వచ్చేశారు. సుశాంత్ చాలా సంవత్సరాలుగా డిప్రెషన్ తో బాధపడుతున్నాడు. అందువల్లే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటాడు అంటూ పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటి వరకు బాలీవుడ్ ప్రముఖుల నుండి ఆయన వద్ద చేసిన ఎంప్లాయిస్.. వంట మనిషి వరకు మొత్తంగా 38 మంది వరకు విచారణ జరిపారు. అయినా కూడా ఎవరిని సుశాంత్ మృతికి అనుమానితులు అంటూ పోలీసులు నిర్థారించలేదు.
ఈ సమయంలో జాతీయ మీడియా సంస్థ సుశాంత్ ఆత్మహత్య కేసును ప్రత్యేకంగా శోధించి పలు విషయాలను తెలుసుకుంది. దాని ప్రకారం సుశాంత్ రెండు కాదు మూడు కాదు ఏకంగా 50 సిమ్ కార్డ్ లను మార్చాడు అంటూ ఆ మీడియా సంస్థ నిరూపించింది. కాని పోలీసులు మాత్రం ఆ విషయాన్ని అస్సలు పట్టించుకోలేదు. ఎవరైనా వ్యక్తి మూడు నాలుగు సిమ్ కార్డ్ లను మార్చాడు అంటేనే పోలీసులు అనుమానించాల్సి ఉంటుంది. కాని సుశాంత్ అన్ని సిమ్ కార్డులను మార్చాడు అంటే కారణం ఏమై ఉంటుందనే విషయాన్ని పోలీసులు ఎంక్వౌరీ చేయాల్సి ఉంటుంది.
బీజేపీ నాయకుడు సుబ్రమణ్య స్వామి ఈ కేసు విషయంలో జోక్యం చేసుకుని సీబీఐకి అప్పగించాలంటూ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతోంది. ముంబయి పోలీసులు ఏమైనా బాలీవుడ్ సినీ ప్రముఖులను కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారా అంటూ అనుమానం వ్యక్తం అవుతుంది. ఆ సిమ్ కార్డుల డేటాను కనిపెట్టగలిగితే పెద్ద విషయాలు ఏమైనా భించే అవకాశం ఉందంటున్నారు. మొత్తానికి సుశాంత్ ఆత్మహత్య కేసు కొత్త మలుపు తిరగడంతో అందరికి మరింత ఆసక్తి పెరిగింది.