Begin typing your search above and press return to search.

సుశాంత్‌ కేసులో స్పీడ్‌ పెంచిన పోలీసులు

By:  Tupaki Desk   |   25 Jun 2020 3:00 PM GMT
సుశాంత్‌ కేసులో స్పీడ్‌ పెంచిన పోలీసులు
X
హీరో సుశాంత్‌ రాజ్‌ పూత్‌ ది ఆత్మహత్య అని పోలీసులు ప్రాధమికంగా నిర్థారించినా కూడా లోతుగా కేసును ఎంక్వౌరీ చేస్తున్నారు. తాజాగా పోలీసుల వద్దకు పోస్ట్‌ మార్టం రిపోర్ట్‌ వచ్చింది. ఐదుగురు ప్రభుత్వ వైధ్యులు ఈ పోస్ట్‌ మార్టం రిపోర్ట్‌ ను పోలీసులకు అందించారు. ఉరి వేసుకుని ఊపిరాడక పోవడం వల్లే అతడు మృతి చెందినట్లుగా పోస్ట్‌ మార్టంలో ఉంది. సుశాంత్‌ రూం నుండి సేకరించిన వస్తువులు మరియు అనుమానిత వస్తువులను మహారాష్ట్ర ఫోరెన్సిక్‌ విభాగంకు పంపించడం జరిగింది.

కేసును త్వరితగతిన పూర్తి చేసేందుకు వెంటనే ఆ రిపోర్ట్‌ ను ఇవ్వాలంటూ పోలీసు శాఖ ఫోరెన్సిక్‌ విభాగంను కోరింది. సుశాంత్‌ ను ఎవరైనా చంపే అవకాశం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటి వరకు సుశాంత్‌ తో పని చేసిన వ్యక్తులు మరియు సంస్థలతో పాటు ప్రియురాలిగా ప్రచారం జరుగుతున్న రియా చక్రవర్తిని పోలీసులు విచారించారు. మొత్తం 23 మందిని పోలీసులు విచారించినట్లుగా తెలుస్తోంది.

2012 సంవత్సరంలో సుశాంత్‌ యష్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ తో అగ్రిమెంట్‌ చేసుకున్నాడు. ఆ అగ్రిమెంట్‌ గురించి సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ అగ్రిమెంట్‌ ను కూడా తెప్పించుకుని పరిశీలించారట. అదే సమయంలో యష్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ కు సంబంధించిన ప్రతినిధులను కూడా విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. సుశాంత్‌ ఫోన్‌ సంభాషణలు మరియు ఆయన ఛాటింగ్‌ వివరాలు మెయిల్‌ ఇలా అన్నింటిని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ కేసును త్వరలోనే పూర్తి చేసేందుకు ఉన్నతాధికారులు స్పీడ్‌ గా ఎంక్వౌరీ చేస్తున్నారు.