Begin typing your search above and press return to search.
హీరోయిన్ ఛాలెంజ్.. పద్మ అవార్డు వెనక్కి ఇస్తా
By: Tupaki Desk | 18 July 2020 11:10 AM GMTబాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. సుశాంత్ ఆత్మహత్య కేసు విషయంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానంది. తన వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు ఒక సారి ఫోన్ చేశారు. నేను మనాలిలో ఉన్న సమయంలో వారి ఫోన్ వచ్చింది. నా వాంగ్మూలంను తీసుకునేందుకు ఎవరినైనా పంపించాలంటూ నేను అడిగాను. కాని ఇప్పటి వరకు ఎవరిని కూడా నా వద్దకు పంపించలేదని కంగనా పేర్కొంది.
ఇండస్ట్రీలో ఉన్న నెపొటిజంపై నేను చేసిన ఆరోపణలను నిరూపించుకోకుంటే నా వద్ద ఉన్న పద్మశ్రీ అవార్డుకు నేను అర్హురాలిని కాదు. నేను చేసిన ప్రతి ఒక్క విమర్శకు నేను సమాధానం చెప్తాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి గురించి నేను చేసిన వ్యాఖ్యలకు ఎప్పటికి కట్టుబడి ఉంటాను. ఇప్పుడే కాదు ఇంకా కొన్నాళ్లకు అయినా నేను వాటికి సమాధానం చెప్పేందుకు సిద్దం. నేను చేసిన వ్యాఖ్యలను ఎవరైనా తప్పుడు వ్యాఖ్యలుగా నిరూపిస్తే తన పద్మ అవార్డును సైతం వెనక్కు ఇచ్చేస్తానంటూ ఛాలెంజ్ చేసింది.
సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్‌లో నెపొటిజం గురించి విపరీతమైన చర్చ జరిగింది. బాలీవుడ్‌లో ఉన్న ప్రముఖుల పేర్లు చెబుతూ కంగనా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు ఆమెను ప్రశ్నించాలనుకున్నారు. కాని ఆమె ఆ సమయంలో మనాలిలో ఉండటంతో ఆమెను ప్రశ్నించలేదు. ఆ తర్వాత కూడా ఆమెను ప్రశ్నించేందుకు పోలీసులు వెళ్లలేదు. ఈ విషయమై ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో కంగనా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చింది.