Begin typing your search above and press return to search.
ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై పోలిశెట్టి ట్వీట్.. మూడు బిగ్గెస్ట్ ప్రొడక్షన్స్ తో సినిమాలు..!
By: Tupaki Desk | 3 July 2021 11:55 AM GMT'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు టాలెంటెడ్ యాక్టర్ నవీన్ పోలిశెట్టి. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న యువ హీరో.. ఈ క్రమంలో 'చిచోరె' సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టి.. అక్కడ కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో వచ్చిన రెండో సినిమా 'జాతిరత్నాలు' తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని.. కోవిడ్ సమయంలో సెన్సేషన్ సృష్టించాడు. అయితే ఈ సినిమా వచ్చి నాలుగు నెలలు దాటిపోవడంతో పోలిశెట్టి తదుపరి సినిమా ఎంటనే ఆసక్తి అందరిలో ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై అప్డేట్ ఇచ్చాడు నవీన్.
నవీన్ సినిమాలు చూసిన ఓ అభిమాని ట్విట్టర్ లో యువ హీరో నటనను మెచ్చుకుంటూ ట్వీట్ పెట్టారు. దీనిపై స్పందించిన పోలిశెట్టి.. తనదైన శైలిలో వ్యంగ్యంగా ట్వీట్ చేస్తూ ఆల్రెడీ మూడు ప్రాజెక్ట్స్ లైన్ లో ఉన్నట్లు ప్రకటించాడు. "థ్యాంక్యూ సో మచ్. ప్రస్తుతం తదుపరి మూడు సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. నా హ్యాండిల్ లో త్వరలో వాటిని ప్రకటిస్తాను. 'ఇంకెక్కడ ఏమి చదివినా నమ్మకండి' - ఆల్బర్ట్ ఐన్ స్టీన్. బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌసెస్ తో కలసి పనిచేయడం ఒక కల. మీ కోసం స్టోర్ లో ఉంచిన వాటి గురించి చెప్పడానికి ఎగ్జైటింగ్ గా ఉన్నాను" అని నవీన్ పోలిశెట్టి ట్వీట్ చేశారు.
నవీన్ పోలిశెట్టి చెప్పిన బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌసెస్ లు యూవీ క్రియేషన్స్ - GMB ఎంటర్టైన్మెంట్స్ - వైజయంతీ మూవీస్ సంస్థలే అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. యూవీ బ్యానర్ లో అనుష్క శెట్టి - నవీన్ ప్రధాన పాత్రలతో 'మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి' అనే సినిమా తెరకెక్కనుందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అలానే మహేష్ బాబు ప్రొడక్షన్ లో కూడా ఓ ప్రాజెక్ట్ ఉంటుందని టాక్. ఇక 'జాతిరత్నాలు' మేకర్స్ తో దానికి సీక్వెల్ ఉంటుందని తెలుస్తోంది. వీటిపై క్లారిటీ రావాలంటే నవీన్ పోలిశెట్టి ట్విట్టర్ హ్యాండిల్ లో అప్డేట్ ఇచ్చే వరకు ఆగాల్సిందే.