Begin typing your search above and press return to search.
సినిమాల వేళ ఎన్నికల గోల
By: Tupaki Desk | 18 March 2019 5:30 PM GMTసంక్రాంతికి వచ్చిన ఎఫ్2 తర్వాత ఆ స్థాయి కానీ అందులో సగం కానీ అందుకున్న సినిమా ఈ మూడు నెలల్లో ఒక్కటంటే ఒక్కటీ లేక బాక్స్ ఆఫీస్ మరీ నీరసంగా ఉంది. ఫిబ్రవరి కొంత నయం అనుకుంటే మార్చ్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇంగ్లీష్ హిందీ మూవీస్ తో థియేటర్లను నెట్టుకుంటూ వస్తున్నారు. ఇక ఏప్రిల్ మొదటివారం నుంచి నాన్ స్టాప్ సందడి మొదలుకాబోతోంది.
అయితే అదే నెలలో ఎన్నికలు ఉండటం ఆపై నెల 23న ఫలితాలు వచ్చే దాకా రాజకీయ వర్గాలతో పాటు రెండు రాష్ట్రాల ప్రజానీకం వీటి మీదే అధికంగా ఆసక్తి చూపుతుండటంతో ఎంతమేరకు వీటి ప్రభావం ఉంటుందన్న అంచనాలు అప్పుడే మొదలైపోయాయి. ముందుగా ఈ పరీక్షలో నిలిచేది నాగ చైతన్య మజిలీ. 5నే వచ్చేస్తుంది. పోలింగ్ 11 కాబట్టి జనల మూడ్ ఇంకా దాని మీదే ఉంటుంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు లేకపోయినా లోక సభ ఉన్నాయి కాబట్టి ఎఫెక్ట్ ఇక్కడా ఉంటుంది
చిత్రలహరికి మంచి అడ్వాన్టేజ్ ఉంది. పోలింగ్ మరుసటి రోజు రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రేక్షకులు సినిమా హాళ్ల వైపు కదులుతారు. పైగా టీజర్ కు రెస్పాన్స్ బాగానే రావడం శుభసూచకంగా ఫీలవుతున్నారు. ఆపై వారం నాని జెర్సికి వచ్చిన చిక్కేమి లేదు. టాక్ బాగుంటే నిలబడుతుంది.
అప్పటికి మజిలీ-చిత్రలహరి ఒకటి రెండు వారాలు పూర్తి చేసుకుని ఉంటాయి కాబట్టి సమస్య లేదు. ఆపై బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సీతతో దిగుతాడు. పోలింగ్ అయిపోయినప్పటికీ ఏప్రిల్ 11 తర్వాత కూడా ఎవరు అధికారంలోకి వస్తారనే ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొని ఉంటుంది. పైగా ఇదే నెలలో కొన్ని పోటీ పరీక్షలు కూడా ఉన్నాయి. సో ఏప్రిల్ లో సినిమాలకు పెద్ద సవాల్ ఎదురు కానుంది.