Begin typing your search above and press return to search.

'నోటా' లో ముగ్గురు సీఎంల లాలూచీ

By:  Tupaki Desk   |   27 Sep 2018 6:34 AM GMT
నోటా లో ముగ్గురు సీఎంల లాలూచీ
X
ముఖ్య మంత్రి స్థాయి ప్ర‌ముఖుల ప్ర‌స్థావ‌న అంటే డౌట్స్ షురూ. సీఎమ్‌ ల‌పైనే సీన్స్‌ అంటే .. రాజ‌కీయ అవినీతిపై ప్ర‌స్థావిస్తున్నారా? అన్న సందేహాలు వ‌స్తాయి. `నోటా`లో అందుకు ఆస్కారం ఉందా? అంటే ఉండే ఛాన్స్ ఉంద‌న్న ప్ర‌చారం సాగుతోంది. ఎందుకంటే ఈ సినిమా రాజ‌కీయ నేప‌థ్యం ఉన్నది. పైగా ముగ్గురు ముఖ్య‌మంత్రుల జాత‌కాల్ని ట‌చ్ చేస్తున్నార‌ట‌. ఆ ముగ్గురు సీఎంలు ఎవ‌రు? అంటే ..ద‌శాబ్ధాల పాటు పాల‌న సాగించి దేశ‌రాజకీయాల్లోనే గొప్పగా పేరు బ‌డిన వారేన‌న్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

ఆంధ్ర ప్ర‌దేశ్‌ ను ద‌శాబ్ధం పైగానే పాలించిన కాంగ్రెసేత‌ర ముఖ్య‌మంత్రి - టీడీపీ పార్టీ ఫౌండ‌ర్ అధ్య‌క్షుడు - మాజీ సీఎం నంద‌మూరి తార‌క రామారావు - హైటెక్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపైనా `నోటా`లో కీల‌క స‌న్నివేశాల్ని తెలుగు - త‌మిళ ప్రేక్ష‌కులు చూడ‌బోతున్నార‌ని తెలుస్తోంది. అంతేకాదు.. ఐదు సార్లు త‌మిళ‌నాడును పాలించిన మేటి మ‌హిళా సీఎం - అమ్మ‌ జ‌య‌ల‌లిత‌పైనా `నోటా`లో ప్ర‌స్థావ‌న ఉందిట‌. ఆ ముగ్గురు ముఖ్య‌మంత్రుల‌పై చెప్పుకోద‌గ్గ సీన్లే ఉన్నాయి కాబ‌ట్టి వీటిలో వివాదాలు తొంగి చూసే చాన్సుంద‌నే ప్ర‌చారం సాగుతోంది.

ఇదే సందేహాన్ని వ్య‌క్తం చేస్తే.. స్టూడియోగ్రీన్ సంస్థ అధినేత - నోటా నిర్మాత‌ జ్ఞాన‌వేల్ రాజా ఓ మీడియా స‌మావేశంలో ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చారు. ``ఎన్టీఆర్‌ - చంద్ర‌బాబు నాయుడుపై స‌న్నివేశాలు ఉన్న మాట నిజ‌మే. `నోటా`లో వారిపై సీన్స్‌ ని యాడ్ చేశాం. అలానే త‌మిళ‌నాడు మాజీ సీఎం జ‌య‌ల‌లిత ఆస్ప‌త్రిలో చేరిన‌ప్పుడు ఏం జ‌రిగిందో చూపే సీన్స్ ఉన్నాయి. అయితే వీటిలో ఎక్క‌డా వివాదాల్ని ట‌చ్ చేయ‌లేదు`` అని స‌మాధాన‌మిచ్చారు. ద‌క్షిణాది రాష్ట్రాల్లో నేటి రాజ‌కీయాలు - తెర‌వెన‌క పాలిటిక్స్‌ ని మాత్రం గొప్ప‌గా ఆవిష్క‌రించామ‌ని తెలిపారు. స‌రిగ్గా ద‌స‌రా సెల‌వుల‌కు ముందు అక్టోబ‌ర్ 5న ఈ సినిమాని తెలుగు - త‌మిళ్‌ లో రిలీజ్ చేస్తున్నారు. ఒక‌వేళ హిట్ట‌యితే ద‌స‌రా సెల‌వులు పెర్ఫెక్ట్‌ గా క‌లిసొస్తాయ‌న్న‌దే ప్లాన్. త‌మిళ‌నాడులో ప్ర‌చారం బావున్నా - తెలుగు రాష్ట్రాల్లో ఇప్ప‌టివ‌ర‌కూ `నోటా`కు స‌రైన ప్ర‌మోష‌న్ లేనేలేదు. ఆ క్ర‌మంలోనే హైద‌రాబాద్‌ - విజ‌య‌వాడ‌లో భారీ ఈవెంట్ను ప్లాన్ చేసిన సంగ‌తి తెలిసిందే.