Begin typing your search above and press return to search.
హీరో విజయ్ ని టార్గెట్ చేసిన రాజకీయ నేతలు
By: Tupaki Desk | 17 Jun 2020 3:30 PM GMTతమిళ రాజకీయాలు త్రికోణంగా మారాయి. ఓ వైపు కమల్ హాసన్ ఇప్పటికే రాజకీయాల్లో ఉండగా.. రజినీకాంత్ రాబోతున్నారు. ఇక మరో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నాడట.. ఇలా ముగ్గురు అగ్రహీరోలు.. అశేష అభిమానులున్న తారలు రాజకీయ బరిలోకి దిగడానికి రెడీగా ఉండడంతో తమిళ పాలిటిక్స్ లో హీట్ పెంచింది. దీంతో పాటు హీరో విజయ్ తన సినిమాల్లో బీజేపీ, అధికార అన్నాడీఎంకేపై పరోక్ష విమర్శలతో వార్తల్లో నిలిచారు. అందుకే ఆయనపై ఐటీరైడ్స్ కూడా జరిగాయనే ప్రచారం కోలీవుడ్ లో ఉంది.
భారీ అభిమాన గణం ఉన్న ఇళయ దళపతి విజయ్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయాల్లో జోక్యం చేసుకోనివ్వవద్దని అధికార అన్నాడీఎంకే ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం. యూత్ ఫాలోయింగ్ విపరీతంగా ఉన్న విజయ్ పాలిటిక్స్ లోకి రాకుండా స్కెచ్ గీస్తున్నారట..
ఈ క్రమంలోనే ఆర్థికంగా దిగ్బంధించడం.. దాడులు చేయడం.. సంఘాల నుంచి ఆయనను వేటు వేసే కుట్రలకు అధికార పార్టీ తెరతీస్తోందని వార్తలు వెలువడుతున్నాయి. వచ్చే ఏడాది ఎన్నికల్లోపు విజయ్ ను దెబ్బతీయాలని చూస్తున్నాయట.. సో మరి ఈ రాజకీయ కుట్రలను విజయ్ ఎలా ఎదుర్కొంటాడో చూడాలి మరీ.