Begin typing your search above and press return to search.

నాన్న‌కు ప్రేమ‌తో... పొలిటిక‌ల్ ప్రెజ‌ర్స్‌?

By:  Tupaki Desk   |   12 Jan 2016 3:55 AM GMT
నాన్న‌కు ప్రేమ‌తో... పొలిటిక‌ల్ ప్రెజ‌ర్స్‌?
X
ఎన్టీఆర్ న‌టించిన నాన్న‌కు ప్రేమ‌తో సెన్సార్ పూర్త‌యింది. దీంతో ఇక రిలీజ్ విష‌యంలో ఎలాంటి సందేహాల‌కు తావు లేదు. ఇప్ప‌టికే టిక్కెట్ విండో కిట‌కిట‌లాడిపోతోంది. ఆన్‌ లైన్‌ లో క్లిక్కులు హోరెత్తిపోతున్నాయ్‌. అయితే ఈ సినిమా రిలీజ్ విష‌యంలో కొన్నిఅడ్డంకులేర్ప‌డ్డాయి. కొన్ని పొలిటిక‌ల్ ప్రెజ‌ర్స్ బ‌లంగా ప‌నిచేశాయ‌ని ఇటీవ‌లి కాలంలో అంతా ముచ్చ‌టించుకున్నారు.

ఇదే ప్ర‌శ్న ఎన్టీఆర్‌ నే అడిగితే .. అవును పొలిటిక‌ల్ ప్రెజ‌ర్స్ ప‌నిచేశాయ్‌. నిజ‌మే.. టిక్కెట్టు కావాలంటూ తెగ ఒత్తిడి చేశారు అంటూ త‌న‌దైన శైలిలో స్పందించాడు. అంద‌రూ టిక్కెట్లు కొనుక్కుని థియేట‌ర్ల‌లో చూసి ఎంజాయ్ చేయండి అంటూ అభిమానుల‌కు చెప్పాడు. రేప‌టి రాత్రి నుంచే అభిమానుల‌కు స్పెష‌ల్ బెనిఫిట్ షోలు రెడీ అవుతున్నాయ్‌. ఇప్ప‌టికే టిక్కెట్ల అమ్మ‌కాలు సాగుతున్నాయ్‌.

టెంప‌ర్ త‌ర్వాత ఎన్టీఆర్‌ కి - 1 నేనొక్క‌డినే త‌ర్వాత సుకుమార్‌ కి ఈ మూవీ ఎంతో కీల‌కం. అందుకే ఎంతో తీవ్రంగా శ్ర‌మించి సీరియ‌స్ ఎటెంప్ట్ చేశారు. మూవీ రిలీజ్‌కి ముందే బోలెడంత హైప్ వ‌చ్చింది. కంటెంట్ లో సంథింగ్ మ్యాట‌ర్ ఉంద‌న్న ఉత్సుక‌త అంద‌రిలోనూ ఉంది. అందుకే టిక్కెట్ల కోసం కొట్టాట కూడా అదే రేంజులో ఉంది. బాల‌య్య‌తో ఎన్టీఆర్ పోటీప‌డుతున్నాడు కాబ‌ట్టి అత‌డిపై రాజ‌కీయ ఒత్తిళ్లు ఉంటాయేమో? అన్న గెస్సింగ్స్ సాగాయ్‌. కానీ సినిమా బిజినెస్‌ లో అవేం వ‌ర్క‌వుట్ కావ‌ని ఎన్టీఆర్ చెప్ప‌క‌నే చెప్పాడు మ‌రి.