Begin typing your search above and press return to search.
పీకే తో షారుఖ్ సమావేశం: ఈ కలయిక దేని కోసమో..!
By: Tupaki Desk | 12 Jun 2021 9:30 AM GMTరాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. నరేంద్ర మోదీ - వైఎస్ జగన్మోహన్ రెడ్డి - మమత బెనర్జీ.. ఇలా ఎందరో రాజకీయ నాయకుల్ని అగ్ర పీఠాల్లో కుర్చోబెట్టిన పొలిటికల్ అనలిస్ట్ పీకే. అయితే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తరువాత పొలిటికల్ స్ట్రాటజీ స్పేస్ కి దూరంగా ఉన్న ప్రశాంత్ కిషోర్.. ఇప్పుడు ఉన్నట్టుండి బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ను కలవడం చర్చనీయాంశంగా మారింది.
ముంబై బాంద్రాలోని కింగ్ ఖాన్ నివాసం 'మన్నాత్' లో శుక్రవారం రాత్రి షారుఖ్ ఖాన్ తో ప్రశాంత్ కిషోర్ సమావేశమయ్యారు. ఈ మీటింగ్ వెనుక ఉద్దేశ్యం ఏమిటో బయటకు వెల్లడించనప్పటికీ, సోషల్ మీడియాలో దీని గురించి ముమ్మరంగా చర్చలు జరుగుతున్నాయి. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రశాంత్ కిషోర్ జీవితం ఆధారంగా ఓ వెబ్ సిరీస్ చేయాలని షారుక్ ప్లాన్ చేస్తున్నారని.. అందుకోసమే పీకే తో చర్చలు జరుపుతున్నారని టాక్ నడుస్తోంది.
అదే సమయంలో ఇన్నాళ్లూ పొలిటికల్ పీఆర్ గా వర్క్ చేసిన రాజకీయవేత్త ప్రశాంత్ కిశోర్.. ఇప్పుడు సినిమా ప్రమోషన్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని.. షారుక్ ఖాన్ కు పర్సనల్ పీఆర్ గా పీకే తన స్ట్రాటజీలను వాడబోతున్నాడని మరో రూమర్ చక్కర్లు కొడుతోంది. అంతేకాదు ఈ మీటింగ్ షారుఖ్ పొలిటికల్ కెరీర్ కు సంబంధించినదని మరో పుకారు ప్రచారంలో ఉంది. మరి షారుక్ - ప్రశాంత్ కలయిక ఎందుకోసమో త్వరలోనే క్లారిటీ వస్తుందేమో చూడాలి.
ఇకపోతే 2018లో వచ్చిన 'జీరో' సినిమా తర్వాత షారుక్ ఖాన్ గ్యాప్ తీసుకున్నారు. గత మూడేళ్లుగా ఆయనకు సంబంధించిన ఏ సినిమా విడుదల కాలేదు. అయితే ప్రస్తుతం 'పఠాన్' అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా గడ్డం గీసుకోవాల్సిన సమయం వచ్చిందదంటూ పోస్ట్ పెట్టిన కింగ్ ఖాన్.. షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లు హింట్ ఇచ్చారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో రూపొందే ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. దీపికా పదుకొనే