Begin typing your search above and press return to search.
డైరెక్టర్ పై ప్రెజర్ పెంచుతున్న మంత్రి
By: Tupaki Desk | 5 Oct 2017 3:31 AM GMTసినిమా ఇండస్ట్రీలో విజయానికి ఉండే గుర్తింపే వేరు. ముఖ్యంగా వరస విజయాలు అందించే డైరెక్టర్ గా గుర్తింపు లభిస్తే మాకో సినిమా చేసిపెట్టమంటూ నిర్మాతలు వెంటపడుతుంటారు. హీరోలు కూడా అడిగిన వెంటనే కాదనకుండా డేట్లిస్తారు. ఇంతవరకు బాగానే ఉంటుంది. కానీ ఒకోసారి సక్సెస్ కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. ఇష్టం లేని పని తలకెత్తుకోవాల్సిన పరిస్థితిని తీసుకొస్తోంది. ఇప్పుడు ఇండస్ట్రీలోని ఓ యంగ్ డైరెక్టర్ కు ఇదే పరిస్థితి ఎదురవుతోంది.
దీని వెనుక బ్యాక్ గ్రౌండ్ ఏమిటంటే.. అనగనగా ఓ రాజకీయ నాయకుడు. స్వతగాహానే రిచ్. రాజకీయాల్లోకి వచ్చి మంత్రి పదవి కూడా వరించడంతో సొమ్ములకు లోటు లేకుండాపోయింది. ఆయన సంతానానికి ఉన్నట్టుండి హీరో అయిపోవాలనిపించింది. హీరోగా ట్రై చేశాడు కానీ ఏ మాత్రం గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. సినిమాల్లో రాణించడానికి ఆకారం ఉంటే సరిపోదు.. నటించడం కూడా రావాలి కదా. సో ఇప్పుడు అతడికో సక్సెస్ సంపాదించిపెట్టడానికి డైరెక్టర్ అవసరమయ్యాడు. అంతకుముందు వరకు బూతు తరహా సినిమాలు తీసి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఆ తర్వాత పద్ధతి మార్చుకుని మంచి సినిమాలు తీస్తున్న ఓ డైరెక్టర్ కనిపించాడు. తక్కువ బడ్జెట్ లో సినిమా పూర్తి చేసి హిట్ కొట్టే సత్తా అతడికుందని ఈ రాజకీయ నాయకుడికి తెలిసిపోయింది. అందుకే తన కొడుకుని హీరోగా పెట్టి సినిమా తీయమని పట్టుపడుతున్నాడు.
ఇందుకోసం సినిమా స్టయిల్లో నువ్వు అడిగినంత మొత్తం అంటూ చెక్కు ఇవ్వడానికి రెడీ అయిపోయాడు. అయినా డైరెక్టర్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాకపోవడంతో అతడు భవిష్యత్తులో సినిమా తీయాలని కోరుకుంటున్న స్టార్ హీరో ద్వారా రికమండేషన్ కూడా చేయించాడు. దీంతో డైరెక్టర్ సరేననక తప్పని పరిస్థితి. చూద్దాం.. అతడు ఎంతవరకు ఆ రాజకీయ నాయకుడి ఆశలు నెరవేర్చగలుగుతాడో?