Begin typing your search above and press return to search.
ఏయ్ ఈ టైమ్ లో డైరెక్టర్ ఏసేశాడు!
By: Tupaki Desk | 19 Feb 2022 5:53 AM GMTఓవైపు ఆ ఇద్దరు హీరోల నడుమా కోల్డ్ వార్ నడుస్తోంది. టాలీవుడ్ లో ఎలక్షన్లు మొదలు .. పెద్దరికం హోదా వరకూ ప్రతిదాంట్లో పోటాపోటీ కనిపిస్తోంది. ఏం జరిగినా ఒకరి పై ఒకరు పైచేయి కోసం పాకులాటా బయటపడుతోంది. ఒకవైపు గెలుపు వస్తే ఇంకో వైపు కుళ్లు కనిపిస్తోంది.
మొత్తానికి ఆ ఇద్దరి మధ్యా ఊహించని ఈ పోరు ఇటీవల వేడెక్కించింది. అదంతా సరే కానీ.. ఒక వైపు స్టార్ హీరో ముఖ్యమంత్రులను కలుస్తూ ఇండస్ట్రీ కి అవసరమైన వాటి గురించి ఎప్పటికప్పుడు తనవంతు ప్రయత్నం చేస్తూ సిసలైన పెద్దగా పాపులారిటీని నిలబెట్టుకుంటున్నారు.
అయితే మరోవైపు పెద్ద హీరో మాత్రం ఇది చేయడంలో తడబడ్డారు. సదరు పెద్ద హీరో తనయుడు సైతం మాటలు కోటలు దాటించడం తప్ప వాస్తవికంగా ఏదీ చేయలేకపోవడంపైనా గుసగుసలు వినిపిస్తున్నాయి. తాను గెలిస్తే.. ముఖ్యమంత్రుల్ని కలిసి ఇది చేస్తా అది చేస్తానని బీరాలు పోవడం తప్ప ఏదీ చేయలేదన్న విమర్శ గెలిపించిన వారిలోనే వినిపిస్తోంది.
ఇక ఇదిలా ఉండగానే.. సదరు పెద్ద మనిషి నటించిన సినిమా విడుదలైంది. ఈ సినిమాని తెరకెక్కించిన దర్శకుడు తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. ఆ ఇద్దరు హీరోల నడుమా గొప్ప స్నేహానుబంధం ఉందని అది విడదీయలేని బంధం!! అంటూ ఏసేశాడు. మొత్తానికి ఇలాంటివి చెప్పుకునేందుకు బాగానే ఉంటాయి.
విజువల్ మీడియాలో చూసేవాళ్లకు మాత్రం హాస్యాస్పదంగా అనిపిస్తాయి. ముఖ్యంగా అక్కడేం జరుగుతుందో తెలిసిన వారికి మాత్రం బిగ్ కామెడీ ఎంటర్ టైనర్ లా ఉంటుంది. ఇంతకీ ఆ ఇద్దరు పెద్దమనుషులు ఎవరో మీకు తెలుసు.