Begin typing your search above and press return to search.

'పొన్నియ‌న్ సెల్వ‌న్' పార్ట్-1 ప్రీమియ‌ర్ టాక్!

By:  Tupaki Desk   |   30 Sep 2022 4:54 AM GMT
పొన్నియ‌న్ సెల్వ‌న్ పార్ట్-1 ప్రీమియ‌ర్ టాక్!
X
మ‌ణిర‌త్నం విజువ‌ల్ వండ‌ర్ 'పొన్నియ‌న్' సెల్వ‌న్ మొద‌టి భాగం నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన చిత్ర‌మిది. కొన్ని సంవ‌త్స‌రాల పాటు క‌థ‌పై వ‌ర్కౌట్ చేసి ..రెండేళ్లు ప్ర‌త్యేకంగా స‌మ‌యం తీసుకుని తెర‌కెక్కించిన చిత్ర‌మిది. ఈ సినిమాతో మ‌ణిస‌ర్ ఓ కొత్త జోన‌ర్ లోకి అడుగు పెట్టారు.

కార్తీ..విక్ర‌మ్..జ‌యం ర‌వి..ఐశ్వ‌ర్యారాయ్...త్రిష లాంటి భారీ తారాగ‌ణంతో తెర‌కెక్కిన సినిమా ప్ర‌క‌ట‌న నుంచే అంచ‌నాలు ప‌తాక స్థాయికి చేరుకున్నాయి. ప్రేక్ష‌కుల్లో ఓ విజువ‌ల్ వండ‌ర్ గా హైలైట్ అయింది. మ‌రో బాహుబ‌లి అవుతుంద‌ని...బాహుబ‌లి పోటీగా దిగుతోన్న చిత్ర‌మ‌ని నెట్టింట పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగింది. అయితే ఆ త‌ర‌హా ప్ర‌చారాన్ని కార్తి ఖండిచండంతో కొంత వ‌ర‌కూ అంచ‌నాలు డౌన్ అయ్యాయి.

భార‌త‌దేశ చ‌రిత్ర‌లో చెప్పాల్సిన క‌థ‌లు చాలా ఉన్నాయ‌ని..ప్ర‌తీ చిత్రాన్ని బాహుబ‌లితో పోల్చ‌వ‌ద్దు అంటూ వ్యాఖ్యానించ‌డం కొంత వ‌ర‌కూ అంచ‌నాల్ని త‌గ్గించేలా చేసాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించి అమెరికా నుంచి ప్రీమియ‌ర్ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చేసింది.పొన్నియ‌న్ సెల్వ‌న్ అద్భుత‌మైన క‌థ‌. క‌థ‌లో చాలా ఎమోష‌న్ ఉంది. క‌థ‌ని తెర‌పై మ‌ణిర‌త్నం ఆస‌క్తిక‌రంగా మ‌ల‌చ‌డంలో నూరు శాతం స‌క్సెస్ అయ్యారు. కానీ సినిమాలో వావ్ అనిపించే స‌న్నివేశాలు మాత్రం ఎక్క‌డా క‌నిపించ‌లేద‌ని టాక్ వినిపిస్తోంది.

సినిమాలో ప్రేక్ష‌కుల‌కు ఆశించే కీల‌క‌మైన ఎపిసోడ్స్ మిస్ అయిన‌ట్లు చెబుతున్నారు. మొద‌టి భాగంలోనే చాలా పాత్ర‌ల్ని ప‌రిచ‌యం చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ భాగంలో కార్తి పాత్ర హైలైట్ అయిందిట‌. సినిమా అంత‌టా కార్తీ మేనియా క‌నిపిస్తుందిట‌. విక్రమ్..జ‌యం ర‌వి పాత్ర‌లు మెప్పించిన‌ప్ప‌టికీ కార్తీకి పోటీగా ఆపాత్ర‌ల్ని తీర్చిదిద్దిన‌ట్లు క‌నిపించలేదంటున్నారు.

క‌థ మొత్తాన్ని న‌డిపించింది కార్తీ పాత్ర‌గానే వినిపిస్తుంది. త‌న పాత్ర‌లో మాత్రం కార్తి ఓదిగిపోయాడు. త‌న‌దైన శైలి న‌ట‌న‌తో ఆద్యంతం ఆక‌ట్ట‌కున్న‌ట్లు ప్ర‌శంస‌లొస్తున్నాయి. ఇక తెర‌పై ఐశ్వ‌ర్యారాయ్ త‌న‌దైన అందంతో మరోసారి ప్రేక్ష‌కుల్ని మాయ‌చేసారు. ఆ పాత్ర‌కు ఐశ్వ‌ర్య ప‌క్కా గ‌తా యాప్ట్ అయ్యారు. త్రిష సైతం ఐషూకి ధీటైన అందంతో ఆక‌ట్టుకుందని టాక్ వినిపిస్తుంది.

ఆ రెండు పాత్ర‌ల మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ ఆద్యంతం ర‌క్తిక‌ట్టించింది. రెండు పాత్ర‌లు నువ్వా? నేనా? అన్న‌తీరున సాగిన‌ట్లు తెలుస్తోంది. అలాగే రెహ‌మాన్ నేప‌థ్య సంగీతం సినిమాకి పిల్ల‌ర్ లా నిలిచిందంటున్నారు. ఆర్ ఆర్ తో స్వ‌ర‌మాంత్రికుడు మ‌రోసారి మ్యాజిక్ చేసారు. క‌థ .. సంగీతం బాగున్నప్పటికీ కథనం బలహీనంగా.. ఫ్లాట్‌గా కనిపిస్తుందిట‌. సింహాసనాల ఆటలో కీలకమైన మలుపులు మరియు ఎత్తుగడల వెనుక ఉన్న తీవ్రత అంత ఇంపాక్ట్ గా లేన‌ట్లు తెలుస్తోంది. స్ర్కీన్ ప్లే గ్రిప్పింగా క‌నిపించ‌లేదని టాక్.

గ్రాఫిక్స్‌ వర్క్‌ చెప్పుకోదగ్గ స్థాయిలో లేదుట‌. మణిరత్నం మార్క్ ఫ్రేమ్‌లు అతని అభిమానుల్ని ఆక‌ట్టుకుంటుంది. కానీ విజువల్ వండర్ కాదు. బ‌ల‌మైన పాత్ర‌లు..స‌న్నివేశాలు ఉన్న‌ప్ప‌టికీ విజువ‌ల్ గా సినిమాని హైలైట్ చేయ‌లేదుట‌. PS -1 ఓవర్సీస్‌లో భారీ ఓపెనింగ్స్ సాధించింది. ప్రీమియర్స్ కలెక్షన్స్ తోనే దాదాపు మిలియన్ డాలర్లను రాబట్టిన‌ట్లు స‌మాచారం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.